‘గ్రంధాలయం’: చిన్న సినిమానే కానీ, విషయమున్న సినిమా.!
- February 25, 2023
కొన్ని సినిమాలు విపరీతమైన హైప్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చి బోల్తాకొడుతుంటాయ్. కొన్ని సినిమాలు సైలెంట్‌గా వచ్చి అద్భుతమైన విజయాల్ని అందుకుంటుంటాయ్. స్టార్ హీరోల సినిమాలే, హిట్లు కొట్టాలన్న రూలేమీ లేదిక్కడ. ‘కేరాఫ్ కంచరపాలెం’ వంటి సినిమాలు పెద్ద విజయాల్ని అందుకున్నాయంటే, వాటి గురించి అందరూ మాట్లాడుకున్నారంటే, వాటిలో వున్న సరుకు అలాంటిది.
‘గ్రంథాలయం’ పేరుతో వస్తోన్న ఓ సినిమా గురించి కూడా చాప కింద నీరులా బజ్ క్రియేట్ అవుతూ వస్తోంది. విడుదలకు సిద్ధమవుతోన్న ఈ సినిమాలో విన్నూ మద్దిపాటి హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు టాలెంటెడ్ డైరెక్టర్ సాయి శివన్.
‘గరుడవేగ’ లాంటి సినిమాలకు దర్శకత్వ విభాగంలో పని చేశాడు సాయి శివన్. ‘శేఖరం గారబ్బాయ్’ అనే సినిమాలో నటించాడు విన్నూ మద్దిపాటి. బ్యాక్ గ్రౌండ్‌తో పని లేదిక్కడ. సినిమాలో సత్తా వుంటే, ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారంటూ ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ చేసిన నిర్మాతల మండలి అధ్యక్షుడు దామోదర ప్రసాద్ వ్యాఖ్యానించడం చిత్ర బృందానికి బోలెడంత కాన్ఫిడెన్స్ ఇచ్చినట్లయ్యింది. దామోదర ప్రసాద్ మాటల్లో ఈ సినిమా కోసం టీమ్ పడ్డ కష్టం జెన్యూన్‌గా కనిపించింది.
ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తోన్న ఈ ‘గ్రంధాలయం’ ప్రేక్షకుల్ని ఎలా అలరిస్తుందో వేచి చూడాలి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..