సౌదీ కప్ 2023: విజేతకు కప్ ప్రదానం చేసిన క్రౌన్ ప్రిన్స్

- February 26, 2023 , by Maagulf
సౌదీ కప్ 2023: విజేతకు కప్ ప్రదానం చేసిన క్రౌన్ ప్రిన్స్

రియాద్: ప్రపంచ హార్స్ రేసింగ్ ఈవెంట్ సౌదీ కప్ 2023 4వ ఎడిషన్ విజేతగా జపాన్‌కు చెందిన పాంతలాస్సా నిలిచింది. రియాద్‌లోని కింగ్ అబ్దుల్ అజీజ్ రేస్‌కోర్స్‌లో శనివారం జరిగిన ఈ వేడుకలో  క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహ్మద్ బిన్ సల్మాన్.. హిరూ రేస్ కో లిమిటెడ్ ప్రెసిడెంట్, పాంతలాస్సా యజమానులు నవోకి యోనియామాకు సౌదీ కప్‌ను ప్రదానం చేశారు. ఫైనల్ రేసులో 1:50:80 సమయంలో 1800 మీటర్ల దూరాన్ని పాంథలాస్సా అధిగమించింది. ప్రపంచంలోనే హార్స్ రేసింగ్ లో దీనిని అత్యుత్తమ టైమింగ్ గా భావిస్తున్నారు. మొత్తం $35 మిలియన్ల ప్రైజ్ పూల్‌తో 16 రౌండ్‌లుగా విభజించి నిర్వహించారు. ఇందులో 16 దేశాల నుండి 243 గుర్రాలు పాల్గొన్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com