మస్కట్ ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌.. అలరిస్తున్న చిల్డ్రన్స్ కార్నర్‌

- February 26, 2023 , by Maagulf
మస్కట్ ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌.. అలరిస్తున్న చిల్డ్రన్స్ కార్నర్‌

మస్కట్: ఒమన్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో 27వ మస్కట్ అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన చిల్డ్రన్స్ కార్నర్‌లో వివిధ రకాల కార్యక్రమాలు పిల్లలను ఆకర్షిస్తూనే ఉన్నాయి. చిల్డ్రన్స్ కార్నర్ కోసం ఆర్గనైజింగ్ కమిటీ నుండి డాక్టర్ వఫా బింట్ సలేమ్ అల్ షంసియా మాట్లాడుతూ.. మస్కట్ ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లోని చిల్డ్రన్స్ కార్నర్ అనేక సంస్థలను ఆకర్షించింది. పిల్లలు కోరుకునే కార్యక్రమాలలో వైవిధ్యాన్ని సృష్టించే లక్ష్యంతో గుర్తింపును పెంపొందించడానికి, పిల్లలకు ప్రేరణ ఇచ్చే కొన్ని కార్యకలాపాలపై దృష్టి కేంద్రీకరించినట్లు తెలిపారు. ప్రత్యేకించి కథలకు సంబంధించి వారి భావనలు తెలుసుకోవడం, అధికారిక సంస్థలు పిల్లలను ఉద్దేశించి చేసే కార్యక్రమాలను ప్రోత్సహించడం చిల్డ్రన్స్ కార్నర్ ప్రత్యేకత అన్నారు. 

సుల్తానేట్ ఆఫ్ ఒమన్ నుండి 51 మంది రచయితలు, కళాకారులు, అరబ్ ప్రపంచం నుండి 7 మంది రచయితలు, కళాకారుల భాగస్వామ్యంతో ఇప్పటివరకు నిర్వహించిన కార్యకలాపాల సంఖ్య 166కి చేరుకున్నాయని తెలిపారు. అంతర్జాతీయ చిల్డ్రన్స్ సెంటర్, చిల్డ్రన్స్ ఫస్ట్ అసోసియేషన్ సహా ఎగ్జిబిషన్ నిర్వహణ ఈవెంట్‌లను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎగ్జిబిషన్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ చైల్డ్‌హుడ్, ఒమానీ కమీషన్ ఫర్ హ్యూమన్ రైట్స్, చిల్డ్రన్స్ పబ్లిక్ లైబ్రరీ మరియు నేషనల్ మ్యూజియంలో లెర్నింగ్ సెంటర్, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, స్పోర్ట్స్ అండ్ యూత్ అండ్ చిల్డ్రన్స్ మ్యూజియం తదితర కార్యక్రమాలు మార్చి 4 వరకు కొనసాగుతాయని అల్ షంసియా పేర్కొన్నారు. యువ ఆవిష్కర్త కోసం ప్రాక్టికల్ వర్క్‌షాప్‌లు, గ్రీన్ స్కూల్స్ ప్రాజెక్ట్ ప్రదర్శనలు, కళాత్మక వర్క్‌షాప్ లు, సాంప్రదాయ హస్తకళలు, ప్రోగ్రామింగ్, ఆవిష్కరణ, పిల్లల కోసం సంకేత భాష, కళల కోసం సింథటిక్ వర్క్‌షాప్‌లతో పాటు కథల సేకరణ, చదవడం కూడా ప్రత్యేక కార్యక్రమాలలో భాగంగా ఉన్నాయని తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com