విటమిన్ ‘డి’ లోపిస్తే కలిగే అనర్ధాలేంటో తెలుసా.?

- February 27, 2023 , by Maagulf
విటమిన్ ‘డి’ లోపిస్తే కలిగే అనర్ధాలేంటో తెలుసా.?

శరీరంలో ఎముకలు బలిష్టంగా వుండాలంటే తగిన మోతాదులో శరీరానికి విటమిన్ డి లభించాలి. ఉదయాన్నే వచ్చే లేలేత సూర్య కిరణాలు.. సాయంత్రం తాకే సూర్య కిరణాల్లో విటమిన్ డి అధికంగా వుంటుందన్న సంగతి తెలిసిందే.
అందుకే, ఉదయం, సాయంత్రం కాసేపు ఎండలో వుంటే విటమిన్ డి ఫుష్కలంగా లభిస్తుందని చెబుతుంటారు. అవును నిజమే. ప్రస్తుతం వున్న పరిస్థితుల్లో ఎండకు చాలా దూరంగా జీవిస్తున్నారు. నాగరికత పేరు చెప్పి, ఏసీ రూముల్లోనూ వెంటిలేషన్ లేని ఇళ్లలోనూ జివించాల్సి వస్తోంది. ఈ కారణంగా విటమిన్ డి బాధితులు అధికమవుతున్నారు.
విటమిన్ డి లోపిస్తే.. ఎముకలు పలచబడిపోయి పటుత్వం కోల్పోతాయ్. దాంతో చిన్న వయసులోనే కీళ్ల నొప్పులు, ఆస్థియోఫోరోసిస్ వంటి వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది. తొందరగా అలిసిపోవడం, కండరాలు పట్టేయడం వంటి సమస్యల్ని కూడా సాధారణంగా ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. 
అందుకే, ఎండతో పాటూ, విటమిన్ డి సమృద్ధిగా లభించే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తీసుకోవడంతో పాటూ, కనీసం రోజులో అరగంటైనా సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి. అలాగే, శారీరక శ్రమ, చిన్నపాటి వ్యాయామాలు, నడక, యోగా వంటివి చేయడం తప్పని సరి అని సంబంధిత నిపుణులు చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com