పౌరులకు 8,500 ల్యాండ్ ప్లాట్లను కేటాయించిన షేక్ మొహమ్మద్
- February 28, 2023
యూఏఈ: అల్ యలైస్ 5 ఏరియాలో ఎమిరాటీ పౌరులకు 8,500 ల్యాండ్ ప్లాట్లను వెంటనే కేటాయించాలని దుబాయ్ పాలకుడు, యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆదేశాలు జారీ చేశారు. ప్లాట్లు 120 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయి. జాతీయ గృహనిర్మాణ కార్యక్రమంలో భాగంగా ప్లాట్ల కేటాయింపును వేగవంతం చేయాలనే షేక్ మొహమ్మద్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు.
అల్ యలాయిస్ 5 ఏరియాలో 10కిలోమీటర్ల విస్తీర్ణంలో పచ్చని ప్రాంతాలను వాకింగ్, స్పోర్ట్స్ యాక్టివిటీస్‌కు అనుకూలంగా అభివృద్ధి చేస్తున్నారు. అదే విధంగా 11 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో జనరల్ స్టోర్స్, జిమ్, సైక్లింగ్ ట్రాక్ వంటి వినోద ప్రదేశాలు, ఇతర సౌకర్యాలను డెవలప్ చేస్తున్నారు. ప్లాట్ల కేటాయింపు మొదటి దశ ఫిబ్రవరి 28 నుండి ప్రారంభమవుతుంది. దుబాయ్ నౌ యాప్‌లోని ‘ఎమిరాటి’ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించి పౌరులు తమ అవసరాలకు సరిపోయే ప్లాట్‌ను ఎంచుకోవచ్చు. ఒక కుటుంబంలోని సభ్యులకు అదే పరిసర ప్రాంతంలో ప్లాట్ కేటాయించడంలో ప్రాధాన్యత ఇవ్వబడుతుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..