అల్ రషీద్ ఎక్స్ఛేంజ్ కంపెనీ లైసెన్స్ రద్దు
- February 28, 2023
యూఏఈ: "తీవ్రమైన నియంత్రణ దుష్ప్రవర్తన" కారణంగా అల్ రషీద్ ఎక్స్ఛేంజ్ కంపెనీ లైసెన్స్‌ను రద్దు చేసినట్లు యూఏఈ సెంట్రల్ బ్యాంక్ (CBUAE) వెల్లడించింది. కంపెనీ కార్యకలాపాలను పరిశీలించిన తర్వాత అక్రమాలు నిరూపణ కావడంతో ఎక్స్ఛేంజ్ హౌస్ పై చర్యలు చేపట్టినట్లు రెగ్యులేటర్ తెలిపింది. ఈ నెలలో లైసెన్స్ రద్దు చేయబడిన రెండవ కంపెనీ ఇది. నిబంధనలను పాటించనందుకు ఇటీవల ఫైనాన్షియల్ కంపెనీకి 1.8 మిలియన్ దిర్హామ్‌ల జరిమానా విధించిన విషయం తెలిసిందే.
సెంట్రల్ బ్యాంక్, ఆర్గనైజేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్, యాక్టివిటీస్‌కు సంబంధించి 2018 డిక్రెటల్ ఫెడరల్ లా నంబర్ (14)లోని ఆర్టికల్ 137 ప్రకారం.. అల్ రషీద్ లైసెన్స్‌ను రద్దు చేసినట్లు సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. ఎక్స్‌ఛేంజ్ హౌస్ ఉద్దేశపూర్వకంగా చెల్లింపుల టర్నోవర్‌ను దాచిపెట్టినట్లు, దాని లిక్విడిటీ అవసరాలను తీర్చడంలో విఫలమైనట్లు, సెంట్రల్ బ్యాంక్‌కు తప్పుడు సమాచారాన్ని అందించడం, తీవ్రమైన మనీలాండరింగ్ మాల్‌ప్రాక్టీస్‌లో పాల్గొనడం, అభ్యంతర పత్రాన్ని పొందకుండా లైసెన్స్‌ను బదిలీ చేయడం లాంటి ఉల్లంఘనలను తనిఖీల సందర్భంగా గుర్తించినట్లు యూఏఈ సెంట్రల్ బ్యాంక్ వెల్లడించింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..