లిబరేషన్ టవర్‌ సందర్శనకు పోటెత్తిన సందర్శకులు

- February 28, 2023 , by Maagulf
లిబరేషన్ టవర్‌ సందర్శనకు పోటెత్తిన సందర్శకులు

కువైట్: కువైట్ జాతీయ, విముక్తి రోజుల సందర్భంగా లిబరేషన్ టవర్‌ సందర్శనకు సందర్శకులు పోటెత్తారు. దాదాపు 8 వేల మందికంటే ఎక్కువగా పౌరులు, నివాసితులు, దౌత్యవేత్తలతో సహా సందర్శకులు లిబరేషన్ టవర్ ను సందర్శించినట్లు టెలి-కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. లిబరేషన్ టవర్ గత గురువారం నుండి రెండు షిఫ్టులలో ప్రజల కోసం అందుబాటులో పెట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సంస్థలు, ప్రజా సంఘాలు, సాంస్కృతిక వాలంటీర్లచే వివిధ కార్యక్రమాలు, ప్రదర్శనలను నిర్వహించారు. 150 మీటర్ల ఎత్తులో ఉన్న టవర్‌ను సందర్శించేందుకు ప్రజలు ఆసక్తి చూపడంతో పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com