యూఏఈ నుంచి భారత్ కు వస్తున్నారా.. అయితే మీకు జేబుకు చిల్లే..!
- February 28, 2023
అబుధాబి: భారత్ నుంచి చాలా మంది ఉపాధి కోసం ఇతర దేశాలు వెళ్తుంటారు.రమదాన్ పండుగ సందర్భంగా యూఏఈ నుంచి స్వదేశానికి వచ్చే ఆలోచనలో ఉన్న భారతీయులకు ఇది నిజంగా బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.ఎందుకంటే పండుగ సీజన్‌లో యూఏఈ నుంచి భారత్‌కు విమాన టికెట్ల ధరలు భారీగా పెరగనున్నాయి.ఏకంగా 10 నుంచి 25 శాతం మేర పెరుగుదల ఉంటుందని మీడియాకు తెలిపారు. మార్చి 23 నుంచి ప్రారంభమయ్యే రమదాన్ మాసం నుంచి విమాన ఛార్జీల పెరుగుదల నెమ్మదిగా మొదలవుతుందని అధికారులు తెలిపారు.
మార్చి 21 నుండి 30 వరకు యూఏఈ నుండి భారత్‌కు ఒక రౌండ్ ట్రిప్‌కు ఎకానమీ విమాన టికెట్ ధర సుమారు 1,316 దిర్హాములు ఉండే అవకాశం ఉంది.గతంలో వచ్చిన నష్టాలను రికవరీ చేసుకునేందుకు విమానయాన సంస్థలు ఈ పండుగ సీజన్‌ను ఉపయోగించుకుని ధరలు పెంచేందుకు రెడీ అవుతున్నాయట. అలాగే వేసవి ప్రారంభానికి ముందు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే చివరి నెల కాబట్టి మార్చి, ఏప్రిల్‌లలో ఈ సమయంలో ఇన్‌బౌండ్ ట్రావెల్ డిమాండ్ అత్యధికంగా ఉంటుంది.
ఇక ఈ రమదాన్ మాసంలో యూఏఈ సెలవులు ఇస్తారు.దీంతో చాలా మంది భారతీయులు ఇండియాకు వస్తారు.ముఖ్యంగా ఈ రమదాన్ ముస్లింలకు చాలా పెద్ద పండుగ కాబట్టి వారు తప్పని సారిగా భారత్‌కు వస్తారు.ఇలా వచ్చే వారికి ఈసారి ఖర్చు కాస్త ఎక్కువ కానుంది.కాగా, గత రెండేళ్లుగా మహమ్మారి కరోనా కారణంగా నెమ్మదించిన అంతర్జాతీయ విమాన ప్రయాణాలు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి.ఇదే అదునుగా విమానయాన సంస్థలు ఛాన్స్ దొరికిన ప్రతిసారి చార్జీలు పెంచి సొమ్ము చేసుకుంటున్నాయి.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







