గృహ కార్మికుల నియామకానికి SR7,500 ఎగువ సీలింగ్
- March 01, 2023
రియాద్ : గృహ కార్మికుల నియామకానికి సంబంధించి సౌదీ మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ (MHRSD) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రిక్రూట్మెంట్ ఖర్చులకు సంబంధించి ఎగువ సీలింగ్ ను విధించింది. బురుండి నుండి గృహ కార్మికులను నియమించుకునేందుకు SR7,500 గా నిర్ణయించింది. 2022 సెప్టెంబరులో గృహ కార్మికులను నియమించుకోవడంలో బ్రోకరేజ్ సేవలను అందించే అన్ని లైసెన్స్ రిక్రూటర్లు తమ ఆదేశాలను పాటించాలని మంత్రిత్వ శాఖ తెలిపింది. వివిధ జాతీయతలకు సంబంధించి SR9,500 – ఉగాండా, SR10,000 – థాయిలాండ్, SR10,870 – కెన్యా, SR13,000 – బంగ్లాదేశ్, SR17,288 – ఫిలిప్పీన్స్, SR15,000 – శ్రీలంకలకు ఎగువ సీలింగ్‌ను నిర్ణయించింది. ఈ ఛార్జీల నుండి విలువ ఆధారిత పన్ను(VAT)ను మినహాయించారు.
తాజా వార్తలు
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్‌తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్‌క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్‌లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్‌లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!









