అయ్యో పాపం.! సమంతా నీకిది తగునా.?

- March 01, 2023 , by Maagulf
అయ్యో పాపం.! సమంతా నీకిది తగునా.?

నటిగా సమంతకున్న డెడికేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నటన కోసం ప్రాణం పెట్టేసే అతి కొద్ది మంది నటీ నటుల్లో సమంత పేరు కూడా మొదటి వరుసలో వుంటుందనడం అతిశయోక్తి కాదేమో.

అయితే, ఈ మధ్య మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడి సమంతలో కాస్త హుషారు తగ్గింది. అయినా సినిమా కోసం సెట్స్‌లో దూకితే సమంత పడే కష్టం కిక్కే వేరప్పా. ఈ మధ్యనే ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ కోసం సమంత కసరత్తులు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా బాక్సింగ్ తదితర యాక్షన్ సన్నివేశాల్లో సమంత ప్రత్యేక శిక్షణ తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో సమంత గాయాలపాలైంది. చేతులకు కొద్దిపాటి గాయాలయ్యాయని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సమంత సోషల్ మీడియా ద్వారా పోస్ట్ పెట్టింది.

సమంత డెడికేషన్‌ని మెచ్చుకుంటూ త్వరగా గాయాల నుంచి కోలుకోవాలని నెటిజన్లు పోస్ట్ చేస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com