చుండ్రు బాధిస్తోందా.? ఈ చిన్న చిట్కాలు పాటించి చూడండి.!
- March 02, 2023చుండ్రు చాలా చిన్న సమస్యలా కనిపించే అతి పెద్ద సమస్య. ఓ పట్టాన పని చేసుకోనివ్వదు.. చుండ్రుతో పాటూ, దురద కూడా వుంటే ఆ బాధ వేరే లెవల్.
ప్రస్తుతం కాలుష్యం, జీవన శైలి.. తదితర కారణాల వల్ల అరుదుగా మాత్రమే కనిపించే ఈ సమస్య అత్యంత ఎక్కువగా తయారైంది. వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లలను సైతం వేధిస్తోంది ఈ చుండ్రు సమస్య.
చుండ్రు కారణంగా అనవరసరమైన చికాకులే కాదు.. జుట్టు రాలిపోవడం కూడా అధికమవుతుంది.
చుండ్రును తగ్గించుకోవడానికి రకరకాల షాంపూలు మార్కెట్లో అందుబాటులో వున్న సంగతి తెలిసిందే. అయితే, చుండ్రుకు శాశ్వత పరిష్కారం మాత్రం హోమ్ రెమిడీస్లోనే వుంది.
కొబ్బరి నూనెలో నిమ్మ రసం పిండి తలకు బాగా పట్టించి కొన్ని గంటల పాటు వదిలేయాలి. ఇలా తరచూ చేస్తే నెమ్మదిగా చుండ్రు సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు.
అలాగే, వేప ఆకుల్ని పేస్టులా చేసి తలకు పట్టించినా చుండ్రు బాధ తగ్గుతుంది. మెంతులు నానబెట్టి పేస్టు చేసి తలకు పట్టించినా ఫలితం వుంటుంది. ఈ చిట్కాలు కాస్త ఆలస్యంగా పని చేసినా ఫలితం మాత్రం శాశ్వతంగా వుంటుంది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు