పర్వతారోహణ నిబంధనల ఉల్లంఘనకు Dh50,000 జరిమానా
- March 02, 2023
యూఏఈ: పర్వతారోహణ నిబంధనలను ఉల్లంఘించి, ఇతరుల ప్రాణాలకు హాని కలిగించే వారికి Dh 50,000 జరిమానా విధించబడుతుంది. ఈ మేరకు ఫుజైరా అడ్వెంచర్ సెంటర్ (FAC) తీసుకున్న నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం మార్చి 1 నుండి అమల్లోకి వచ్చింది. ఇటీవల పర్వతాలపై దారితప్పిన వారి సంఖ్య పెరుగుతున్ననేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార యత్రాంగం తెలిపింది. కొత్త నిర్ణయం కాలినడకన నడిచే పర్వతారోహకులు, పర్వత సాహస యాత్రల నిర్వాహకులు, ఆమోదించబడిన పర్యాటక సంస్థలకు వర్తిస్తాయని తన ఉత్తర్వుల్లో తెలిపారు. ఫుజైరా అడ్వెంచర్ సెంటర్ డైరెక్టర్ అమ్ర్ జైనుద్దీన్ మాట్లాడుతూ.. పర్వత ప్రాంతాల నివాసితుల సహకారంతో నలుగురు ఇన్స్పెక్టర్లను నియమించామని, ఎమిరేట్‌లోని 10 పర్వత మార్గాల్లో ఉల్లంఘనలను పర్యవేక్షిస్తారని చెప్పారు. ఔత్సాహికులు, పర్యాటకులలో బాగా ప్రాచుర్యం పొందిన క్లైంబింగ్, ఆఫ్-రోడ్ హైకింగ్ క్రీడను నిర్వహించడానికి కేంద్రం విస్తృతమైన అధ్యయనం నిర్వహించిందని జైనుద్దీన్ తెలిపారు. కొత్త నిర్ణయం పర్వత ప్రమాదాల కారణంగా గాయాలు, రెస్క్యూ ఆపరేషన్ల శాతాన్ని తగ్గించగలదని పేర్కొన్నారు. ఎమిరేట్‌లోని ప్రత్యేక ప్రాంతాలలో 10 పర్వత మార్గాలను కేంద్రం అభివృద్ధి చేసిందని, సేవా సౌకర్యాలు, వారు ఉన్న సైట్ల గురించి ప్రజలకు తెలియజేసే గైడ్ బోర్డులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ నిర్ణయం ఔత్సాహిక పర్వతారోహణ, పర్యాటక సంస్థలకు మేలు చేస్తుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్‌లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్‌లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









