గల్ఫ్ దేశాల్లో చెమటోడ్చే కన్నా.. సులువుగా సంపాదించాలని అడ్డంగా బుక్కయిన వ్యక్తి
- March 03, 2023
కరీంనగర్: గల్ఫ్ దేశాల్లో చెమటోడ్చే కన్న అడ్డదారిలో డబ్బును సులువుగా సంపాదించాలని గంజాయి అమ్మకాలను చేపట్టిన ఓ వ్యక్తి పోలీసులకు అడ్డంగా దొరికిన ఉదంతం కరీంనగర్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతారం గ్రామానికి చెందిన గండికోట దేవరాజు(34)కు ఒక భార్య ఇద్దరు పిల్లలు. తన స్వగ్రామంలో ఉపాధి లేక సుమారు దశాబ్దం క్రితం ఎడారి దేశాలకు పోయాడు. ఒక దశాబ్దం పాటు సౌదీ అరేబియాలో డ్రైవర్ గా పనిచేసిన దేవరాజు తన బొటాబొటి సంపాదనతో అసంతృప్తి చెందాడు. రెండు సంవత్సరాల క్రితం తన స్వగ్రామానికి చేరుకున్నాడు. గంజాయి అమ్మకాలు చేపట్టి అడ్డదారిలో సులువుగా సంపాదించాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఒడిశా రాష్ట్ర సరిహద్దులో గతంలో ట్రాక్టర్ డ్రైవర్ గా కొంత కాలం పనిచేయడం వల్ల అక్కడ గంజాయి సాగు అమ్మకాల గురించి ఉన్న అవగాహనతో.. గంజాయి అమ్మకాలను ఎంచుకొన్నాడు. ఇటీవల కాలంలో గంజాయి క్రయవిక్రయాలపై దృష్టి సారించిన పోలీసులు.. గంజాయి అమ్ముతున్న వ్యక్తులపై నిఘా పెంచారు. దీంతో గండికోట దేవరాజు గంజాయి దందా వెలుగులోకి వచ్చింది. అతడి కదలికలపై క్షణక్షణం నిఘా పెంచిన పోలీసులు.. ఒడిశా నుంచి గంజాయిని తీసుకొస్తుండగా అతడిని రెడ్ హ్యాండెండ్ గా అరెస్టు చేశారు. అతడి దగ్గరనుంచి సుమారు లక్ష రూపాయల విలువైన 5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు కరీంనగర్ - 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్లు పి. దామోదర్ రెడ్డి, పి. శ్రీనివాసరావులు తెలిపారు. గంజాయి రవాణకు సాయం అందిస్తున్న కరీంనగర్ కు చెందిన మహమ్మద్ సైసల్ షరీప్, అబ్దుల్ పాబాజీ, ధరావత్ వినయ్ లను కూడా అరెస్టు చేసినట్లు వారు వెల్లడించారు.
--గుళ్ళపల్లి నారాయణ(మాగల్ఫ్ ప్రతినిధి,కరీంనగర్)
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..