తెలుగు ఇండస్ట్రియలిస్ట్ శ్రీకాంత్ బొల్లా బయోపిక్ ని తెరకెక్కిస్తున్న బాలీవుడ్..
- March 03, 2023
హైదరాబాద్: బాలీవుడ్ వాళ్ళు ఇటీవల బయోపిక్స్ వరుసగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో బయోపిక్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు.ఈ సారి మన తెలుగు వాడైన బ్లైండ్ పర్సన్, యంగ్ ఇండస్ట్రియలిస్ట్ శ్రీకాంత్ బొల్లా బయోపిక్ ని తెరకెక్కిస్తున్నారు.బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావు ఈ బయోపిక్ లో మెయిన్ లీడ్ లో నటిస్తున్నాడు.
మచిలీపట్నంలో ఓ సాధారణ రైతు కుటుంబంలో పుట్టాడు శ్రీకాంత్ బొల్లా అనే బ్లైండ్ పర్సన్. బ్లైండ్ అయినా చదువు మీద ఎంతో ఆసక్తి ఉండటంతో కష్టపడి చదివి కేంబ్రిడ్జ్ లోని ప్రపంచంలోని అత్యుత్తమ యూనివర్సిటీల్లో ఒకటైన మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సీట్ సంపాదించి చదివాడు. ఆ తర్వాత ఇండియాకి వచ్చి పలు కార్యక్రమాల్లో పాల్గొని అబ్దుల్ కలాం నుంచి కూడా మన్ననలు పొందాడు. మొదట 2011లో ఓ బ్రెయిలీ లిపి ప్రింటింగ్ ప్రెస్ ప్రారంభించి తన లాంటి వాళ్లకు పుస్తకాలు, అవసరమైనవి ప్రింట్ చేసి ఇవ్వడం మొదలుపెట్టాడు. అనంతరం 2012 లో బొల్లాంట్ ఇండస్ట్రీస్ స్థాపించి తన లాంటి వాళ్లకు, పర్సనాలిటీ డిజేబుల్డ్ వ్యక్తులకు ఉపాధి కల్పించాడు. దీనికి రతన్ టాటా ఫండింగ్ ఇవ్వడం గమనార్హం. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా అనేక కార్యక్రమాల్లో పాల్గొని బ్లైండ్ పర్సన్ అయినా అత్యున్నత శిఖరాలకు ఎదిగాడు.
ఇప్పుడు ఈయన కథని బాలీవుడ్ బయోపిక్ తీస్తుంది. ఈ బయోపిక్ ని గత సంవత్సరమే అనౌన్స్ చేశారు. తాజాగా శ్రీ అనే టైటిల్ తో శ్రీకాంత్ బొల్లా బయోపిక్ ని 2023 సెప్టెంబర్ 13న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









