ఫ్రూట్, వెజిటబుల్ మార్కెట్‌లో వలసదారుల వివాదం
- May 04, 2016
సౌదీ ఫ్రూట్ అండ్ వెజిటబుల్ మార్కెట్‌లో వలసదారులకు అవకాశం కల్పించడంపై వివాదం తలెత్తింది. జెడ్డాలోని సెంట్రల్ ఫ్రూట్ అండ్ వెజిటబుల్ మార్కెట్‌లో వలసదారులు వ్యాపారం చెయ్యకుండా నిరోదించాలంటూ స్థానిక వ్యాపారులు ఆందోళన చేస్తున్నారు. స్టాల్స్ వరకూ వలసదారుల్ని బ్యాన్ చేసినా, ఉదయాన్నే ఆక్షన్‌లో వలసదారులు పాల్గొంటున్నారనీ, వారిని నిరోధించాల్సిన అవసరం ఉందని స్థానిక వ్యాపారులు డిమాండ్ లేవనెత్తారు. ట్రేడర్స్ కమిటీ ఛైర్మన్ సహీమ్ అల్ ఘమ్ది, సౌదీజేషన్ కమిటీ, సీక్రెట్ పోలీసులను ఏర్పాటు చేసి వలస దారుల్ని జరుగుతుందని తెలిపారు. అయినప్పటికీ ఆక్షన్‌లో వారు పాల్గొంటున్నారనీ, ఈ కారణంగా 4 మిలియన్ సౌదీ రియాల్స్ రెండు రోజుల్లోనే నష్టపోవాల్సి వచ్చిందని అన్నారు. మునిసిపాలిటీ అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు. అయితే మునిసిపాలిటీకి చెందిన మార్కెట్స్ డిమాపఱ&్టమెంట్ డైరెక్టర్ నాజర్ అల్ జరాల్లా మాట్లాడుతూ, వలసదారుల్ని ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ మార్కెట్లలో డైలీ ఆక్షన్ల వరకు నిషేధించలేదని స్పష్టం చేశారు. లీగల్ వలసదారులు స్వేచ్ఛగా మార్కెట్‌లో అమ్మకాలు, కొనుగోళ్ళు సాగించవచ్చని తెలిపారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







