'యూఏఈ రీడ్స్‌' గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డ్‌

- May 04, 2016 , by Maagulf
'యూఏఈ రీడ్స్‌' గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డ్‌

మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ చేపట్టిన సాంస్కృతిక స్ఫూర్తి 'యూఏఈ రీడ్స్‌' గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డ్‌ సాధించింది. 'లార్జెస్ట్‌ రీడింగ్‌ లెస్సన్‌' కేటగిరీలో యూఏఈ ఈ ఘనతను దక్కించుకుంది. షేక్‌ షమ్మా బింట్‌ మొహమ్మద్‌, 'వరల్డ్స్‌ లార్జెస్ట్‌ రీడింగ్‌' అవర్‌లో పలు అంశాల్ని చదువుతుండగా 2,604 మంది మహిళలు ఈ అద్భుత ఘట్టానికి సాక్షులుగా నిలిచారు. 'ఇయర్‌ ఆఫ్‌ రీడింగ్‌ 2016'లో భాగంగా ప్రెసిడెంట్‌ షేక్‌ ఖలీఫా బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఇది దేశానికి అత్యంత గర్వకారణమని పోలీస్‌ కాలేజ్‌ డైరెక్టర్‌ జనరల్‌ కల్నల్‌ వలీద్‌ సలీమ్‌ అల్‌ షమెసి చెప్పారు. మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌కి చెందిన పలువురు సిబ్బంది ఈ అద్భుత ఘట్టంలో పాలుపంచుకున్నారు. 'స్పిరిట్‌ ఆఫ్‌ రీడింగ్‌' అనే ఉద్దేశ్యంతో జనరల్‌ నాలెడ్జ్‌ని ప్రతి ఒక్కరూ సంపాదించుకునేలా ఈ ఏడాదిని 'ఇయర్‌ ఆఫ్‌ రీడింగ్‌' అని ప్రకటించి, పలు కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగానే ఈ 'యూఏఈ రీడ్స్‌'ని కూడా చేపట్టడం జరిగింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com