మార్చి 7న 'సుల్తాన్ ఆఫ్ స్పేస్'తో షేక్ మహ్మద్ ఇంటరాక్ట్

- March 05, 2023 , by Maagulf
మార్చి 7న \'సుల్తాన్ ఆఫ్ స్పేస్\'తో షేక్ మహ్మద్ ఇంటరాక్ట్

యూఏఈ:  భూమికి 400 కిమీ ఎత్తులో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో ఉన్న యూఏఈ వ్యోమగామి సుల్తాన్ అల్నెయాడితో యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మార్చి 7న ఇంటరాక్ట్ కానున్నారు. ఈ ఇంటరాక్షన్ మార్చి 7న సాయంత్రం 4.50 గంటలకు (యూఏఈ సమయం) జరగనుందని నాసా తెలియజేసింది. చివరిసారిగా షేక్ మొహమ్మద్ 2019లో ISSలో తన రెండవ రోజు వ్యోమగామి హజ్జా అల్మన్సూరితో సంభాషించారు. ఎనిమిది రోజులు గడిపిన అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన మొదటి UAE వ్యోమగామి అల్మన్సూరి రికార్డు సృష్టించారు.

సుల్తాన్ అల్నెయాడి ISSలో ఉండనున్న ఆరు నెలల్లో రెండు దుబాయ్ సంస్థలకు ఇంటర్వ్యూలు ఇవ్వనున్నారు. అలాగే యూఏఈలోని విద్యార్థులందరికీ వ్యోమగామిని ప్రశ్నలను అడిగే అవకాశం కల్పంచనున్నారు. 20,000 మంది విద్యార్థులను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మహమ్మద్ బిన్ రషీద్ స్పేస్ సెంటర్ (MBRSC) తెలియజేసింది. MBRSC ఎమిరేట్స్ లిటరేచర్ ఫౌండేషన్‌తో కలిసి ఎల్ఫ్ ఇన్ స్పేస్ అనే విద్యా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆరు నెలల పాటు 13 లైవ్ కాల్‌లు, 10 హామ్ రేడియో ఇంటరాక్షన్‌లు ఉంటాయని తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com