డెలివరీ రైడర్స్ కోసం 3 రెస్ట్ స్టాప్‌ల నిర్మాణం

- March 05, 2023 , by Maagulf
డెలివరీ రైడర్స్ కోసం 3 రెస్ట్ స్టాప్‌ల నిర్మాణం

దుబాయ్: డెలివరీ మోటర్‌బైక్ డ్రైవర్ల కోసం మూడు ఇంటిగ్రేటెడ్ రెస్ట్‌స్టాప్‌లను నిర్మించడానికి టెండర్లను ఆహ్వానించినట్లు దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) తెలియజేసింది. జెబెల్ అలీ విలేజ్ వద్ద ఫెస్టివల్ ప్లాజా సమీపంలో షేక్ జాయెద్ రోడ్, అల్ మురకాబత్ స్ట్రీట్ 22 పక్కన పోర్ట్ సయీద్, అల్ మనామా స్ట్రీట్‌కు దగ్గరగా ఉన్న రస్ అల్ ఖోర్ ఇండస్ట్రియల్ ఏరియా 2లలో ఆర్టీఏ తెలిపింది. నిర్వహణ, ఇంధనం నింపడం, విశ్రాంతి స్థలాలు మరియు రెస్టారెంట్లు వంటి ప్రాథమిక సేవలను ఈ కేంద్రాలు అందిస్తాయి.  డెలివరీ వ్యాపారం గత సంవత్సరాల్లో చెప్పుకోదగ్గ వృద్ధి రేటును నమోదు చేసింది. డిసెంబర్ 2022 నాటికి దుబాయ్ 2,891 డెలివరీ సర్వీస్ కంపెనీలకు నిలయంగా ఉంది. 2021తో పోల్చితే 48 శాతానికి పైగా వృద్ధి రేటు సాధించింది. 36 కంటే ఎక్కువ ఆన్‌లైన్ డెలివరీ కంపెనీలు స్మార్ట్ ప్లాట్‌ఫారమ్‌లు.. అప్లికేషన్‌ల ద్వారా పనిచేస్తున్నాయి. డెలివరీ రంగం సామర్థ్యాన్ని మరియు భద్రతను పెంపొందించడానికి RTA అనేక కార్యక్రమాలను ప్రారంభించింది. వీటిలో ప్రొఫెషనల్ రైడర్ సర్టిఫికెట్లు జారీ చేయడం, డెలివరీ సర్వీస్ ఎక్సలెన్స్ అవార్డు,  రైడర్‌ల కోసం ట్రాఫిక్ అవగాహన వర్క్‌షాప్‌లు నిర్వహించడం వంటివి ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com