యూఏఈలో మిగిలిన వార్షిక సెలవులను ఇలా క్యాష్ చేసుకోవచ్చు..!
- March 05, 2023
యూఏఈ: మిగిలిన వార్షిక సెలవులను ఎలా క్యాష్ చేసుకోవాలో చాలమందికి తెలియదు. దీంతో అవి 'లాప్స్' అవుతాయి. కాబట్టి వాటిని ఎన్‌క్యాష్ చేయడానికి సాధారణ నియమాలు.. ఎన్ని సెలవులను ఎన్‌క్యాష్ చేసుకోవచ్చో ఆశిష్ మెహతా & అసోసియేట్స్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ భాగస్వామి ఆశిష్ మెహతా వివరించారు. యూఏఈలో ఒక సంవత్సరం కంటే ఎక్కువ ఉద్యోగం చేసినవారికి ఉపాధి సంబంధాల నియంత్రణపై 2021 ఫెడరల్ డిక్రీ చట్టం నెం. 33 ('ఉపాధి చట్టం'), 2022 ఫెడరల్ డిక్రీ చట్టం నెం. 33 అమలుపై 2022 కేబినెట్ రిజల్యూషన్ నం. 1 నిబంధనలు, ఉపాధి సంబంధాల నియంత్రణ ('కేబినెట్ రిజల్యూషన్ నం. 1 ఆఫ్ 2022') వర్తిస్తుంది.
యూఏఈలో ఒక ఉద్యోగి యజమానితో ప్రతి సంవత్సరం సర్వీస్ కోసం 30 రోజుల వార్షిక సెలవులకు అర్హులు. ఇది ఉపాధి చట్టంలోని ఆర్టికల్ 29(1)(a)కి అనుగుణంగా ఉంటుంది. ఒక ఉద్యోగి అతని లేదా ఆమె వార్షిక సెలవులో 15 రోజులు మాత్రమే తదుపరి సంవత్సరానికి ఫార్వార్డ్ చేయవచ్చు. ఇది 2022 కేబినెట్ రిజల్యూషన్ నం. 1లోని ఆర్టికల్ 19కి అనుగుణంగా ఉంటుంది.
1. ఉద్యోగి వార్షిక సెలవులో సగానికి మించకుండా తదుపరి సంవత్సరానికి ఫార్వార్డ్ అవుతాయి.
2 ఉద్యోగి సర్వీస్ ముగించిన సమయంలో ప్రాథమిక జీతం ప్రకారం అతనికి చట్టబద్ధంగా చెల్లించాల్సిన వార్షిక సెలవుల బ్యాలెన్స్‌కు నగదు భత్యం చెల్లించాలి.
ప్రతి సంవత్సరం సర్వీస్ పూర్తయిన తర్వాత ఉద్యోగి వార్షిక సెలవు చెల్లించాల్సి ఉంటుంది. అందువల్ల, ప్రతి సంవత్సరం సర్వీస్ పూర్తయిన తర్వాత లేదా రెండు పార్టీల మధ్య అంగీకరించిన విధంగా ఏదైనా నగదు భత్యం యజమాని ద్వారా చెల్లించవచ్చు. పైన పేర్కొన్న చట్ట నిబంధనల ఆధారంగా.. ప్రస్తుత సంవత్సరం వార్షిక సెలవులో కేవలం 15 రోజులు మాత్రమే తదుపరి సంవత్సరానికి ఫార్వార్డ్ చేయవచ్చు. లేదా దాని కోసం మీకు నగదు భత్యం చెల్లించమని మీ యజమానిని అడగవచ్చు. వార్షిక సెలవులకు బదులుగా నగదు భత్యం గణన ఉద్యోగి ప్రాథమిక జీతంపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుత యజమాని దగ్గర సర్వీస్ ముగింపు సమయంలో సేవా వ్యవధిలో పొందని వార్షిక సెలవుల కోసం నగదు భత్యాన్ని క్లెయిమ్ చేయవచ్చు. ఇది ఉపాధి చట్టంలోని ఆర్టికల్ 29(9)కి అనుగుణంగా ఉంటుంది. ఉపాధి చట్టంలోని ఆర్టికల్ 29(4)లో పేర్కొన్న విధంగా ఉద్యోగి వార్షిక సెలవులను షెడ్యూల్ చేసే విచక్షణను యజమాని కలిగి ఉంటాడని మరువొద్దు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..