పవిత్ర మాసంలో ఏ సమయంలో.. ఎలాంటి వ్యాయామాలు..!
- March 06, 2023
యూఏఈ: రమదాన్ అనేది ఆధ్యాత్మికతను ప్రతిబింబించే సమయం. కానీ ఇఫ్తార్, సుహూర్ సమయంలో టేబుల్‌పై ఉన్న అన్ని రుచికరమైన ఆహారాన్ని తినకుండా ఉండటం దాదాపు అసాధ్యం. అలా చేరిన అదనపు బరువును దూరంగా ఉంచడానికి, కొత్త సంవత్సరంలో చేసిన ఆరోగ్య తీర్మానాన్ని పునఃసమీక్షించడానికి రమదాన్ మంచి సమయమని పైలేట్స్ ట్రైనర్ కిర్స్టీ నెల్సన్ అన్నారు. అలాగే ఉపవాసం విరమించే ముందు వ్యాయామం చేయడానికి ఉత్తమ సమయం అన్నారు. అయితే దీనిని ప్రారంభించేందుకు కొన్ని సలహాలను ఇచ్చారు. రమదాన్ మొదటి మూడు రోజులలో వారి శరీరాలను ఉపవాసానికి సర్దుబాటు చేయడానికి వ్యాయామం చేయకుండా ఉండాలని, ఒకవేళ వ్యాయమం చేస్తే కొంతమందికి తలనొప్పి రావచ్చని కిర్స్టీ చెప్పారు. ఇఫ్తార్‌కు ముందు వ్యాయామం చేయడం అనువైనదని, ముఖ్యంగా పని తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి లేదా నిద్రపోయే అవకాశం ఉన్నవారికి ఇది మేలు చేస్తుందని వివరించారు. ఉపవాసం సమయంలో అధిక-తీవ్రతతో కూడిన వ్యాయామం చేయకపోవడం మేలన్నారు. ఉపవాసం సమయాల్లో తక్కువ బరువులు, పైలేట్స్, టోనింగ్ వ్యాయామాలు, సైక్లింగ్ లేదా 40 నిమిషాల నుండి గంట వరకు ఎక్కువసేపు నడవవచ్చని సూచించారు.
క్రమం తప్పకుండా ఎక్సైజ్ చేసే వారికి రమదాన్ సమయంలో రెండు సార్లు సరిపోయే అవకాశం ఉంటుందని సర్టిఫైడ్ ఫిట్నెస్ ట్రైనర్ కోచ్ ఖలీల్ అన్నారు. మొదటిది ఇఫ్తార్‌కు 60-90 నిమిషాల ముందు, రెండవది ఇఫ్తార్ తర్వాత 2-3 గంటలు తర్వాత అని చెప్పారు. కొందరు ఇఫ్తార్‌కు ముందు కార్డియో శిక్షణ, ఇఫ్తార్ తర్వాత సాధారణ వ్యాయమాన్ని ఎంచుకోవచ్చని వివరించారు. గతంలో వ్యాయామం చేయనివారికి 30-40 నిమిషాల నడక మంచి ఫలితాన్ని ఇస్తుందన్నారు. వీలయితే ఒక గంట వాకింగ్ చేస్తే మంచిదని.. ఆ సమయంలో శరీరంలో కొవ్వు బర్నింగ్ కావడం ప్రారంభమవుతుందని తెలిపారు. యాక్టివ్ వాక్, పైలేట్స్ లేదా ఆక్వా ఏరోబిక్స్ వంటి తక్కువ-తీవ్రత గల వ్యాయామాలు అనుకూలంగా ఉంటాయని.. అయితే ఇఫ్తార్ తర్వాత కనీసం ఒక గంట తర్వాత ఇలాంటివి చేయాలని సూచించారు. కొత్తవారు ఇఫ్తార్‌కు కనీసం 60 నుండి 90 నిమిషాల ముందు తేలికపాటి నుండి మితమైన వ్యాయామాలను చేయాలని కోచ్ ఖలీల్ చెప్పారు. తిన్న ఆహారం జీర్ణం కావడానికి.. అసౌకర్యాన్ని నివారించడానికి ఇఫ్తార్ తర్వాత వెంటనే వ్యాయమం, పని చేయవద్దని సలహా ఇచ్చారు. పగటిపూట ఎండలో వేడిగా ఉండే సమయాల్లో వ్యాయామం చేయకూడదని, ఉపవాసం ఉన్నప్పుడు నీరసానికి దారితీస్తుందని చెప్పారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!