పుష్ప కోసం సందీప్ రెడ్డిని దించారా.?

- March 06, 2023 , by Maagulf
పుష్ప కోసం సందీప్ రెడ్డిని దించారా.?

‘అర్జున్ రెడ్డి’ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అంతా బాగానే వుంది కానీ, సందీప్ రెడ్డి ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా వున్నాడు. ఆ తర్వాత ప్రబాస్‌తో ‘స్పిరిట్’ సినిమా చేయాల్సి వుంది.

ప్రబాస్‌తో సినిమా అంటే, ఆ లెక్కలే వేరు. అదిప్పట్లో తేలే లెక్క కాదు. అలాంటిది అల్లు అర్జున్‌తో సందీప్ రెడ్డి చేయబోయే సినిమా ఇంకెప్పుడు సెట్స్ మీదకి వెళ్లాలా.? ఎప్పుడు రిలీజ్ కావాలా.? అదిప్పట్లో జరిగే పనే కాదు కానీ, ప్రస్తుతం అల్లు అర్జున్ చేస్తున్న ‘పుష్ప 2’కి బాలీవుడ్‌లో హైప్ ఇచ్చేందుకే ఈ ప్రకటన చేశారంటూ ప్రచారం జరుగుతోంది.

‘పుష్ప’ మొదటి పార్ట్‌కి బాలీవుడ్‌లో మంచి క్రేజ్ వచ్చింది. ఆ క్రేజ్‌ని అలాగే వుంచుతూ, మరింత పెంచేందుకే బాలీవుడ్ క్రేజీ డైరెక్టర్‌గా పేరు తెచ్చేసుకున్న సందీప్ రెడ్డి వంగాతో తాజా ప్రాజెక్ట్ అనౌన్స్ చేసేశారని మాట్లాడుకుంటున్నారు. ఏమో అయినా కావచ్చు. సినిమా లెక్కలు అట్లుంటాయ్ మరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com