కొత్త మ్యూజియాన్ని ప్రారంభించిన షేక్ మొహమ్మద్

- March 07, 2023 , by Maagulf
కొత్త మ్యూజియాన్ని ప్రారంభించిన షేక్ మొహమ్మద్

యూఏఈ: దుబాయ్ లోని అతిపెద్ద హెరిటేజ్ మ్యూజియాన్ని యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రారంభించారు. ఇందులో 80 చారిత్రాత్మక హాల్స్, 22 పెవిలియన్‌లు ఉన్నాయి. దుబాయ్, యూఏఈ అభివృద్ధిని ప్రదర్శిస్తూ.. పునర్నిర్మించిన అల్ షిందాఘా మ్యూజియం 1800ల నాటి ప్రదర్శనలతో సాంప్రదాయ ఎమిరాటీ జీవనశైలి, ఈ ప్రాంతం గొప్ప సాంస్కృతిక వారసత్వం గురించి తెలియజేస్తుంది. "దుబాయ్ చరిత్రను ప్రపంచం తెలుసుకోవాలని మేము కోరుకుంటున్నాము" అని ఈ సందర్భంగా షేక్ మహ్మద్ బిన్ రషీద్ కోరారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com