ఒమన్‌లో పన్ను రేటు: ప్రపంచంలోనే అత్యల్పం
- March 07, 2023
మస్కట్: అమెరికన్ వరల్డ్ పబ్లికేషన్ రివ్యూ వెబ్సైట్ రూపొందించిన గ్లోబల్ టాక్స్ ఇండెక్స్ 2023 ప్రకారం.. ఒమన్ ప్రపంచంలో తక్కువ పన్ను భారం ఉన్న దేశాలలో ఒకటిగా స్థానం పొందింది. సుల్తానేట్, బెర్ముడా, కేమాన్ దీవులు, బహామాస్, బ్రూనై దారుస్సలాం సుల్తానేట్, బహ్రెయిన్, ఖతార్, కువైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గ్లోబల్ టాక్స్ ఇండెక్స్ అత్యల్ప పన్ను రేటు కలిగిన దేశాలుగా నిలిచాయి. ఇండెక్స్ ప్రకారం.. సుల్తానేట్ ఆఫ్ ఒమన్‌లో ఆదాయపు పన్ను రేటు సున్నా శాతం. అమ్మకపు పన్ను రేటు ఐదు శాతం. కార్పొరేట్ లాభాలపై పన్ను 15 శాతంగా ఉంది. కోట్ డి ఐవరీ (ఐవరీ కోస్ట్) అత్యధిక పన్నురేటుతో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. అక్కడ ఆదాయపు పన్ను రేటు 60 శాతం. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా ఫిన్లాండ్, జపాన్, ఆస్ట్రియా, తర్వాత డెన్మార్క్ మరియు స్వీడన్ ఉన్నాయి. 2020 అక్టోబర్ 12న ఒమన్ సుల్తాన్ హైతం బిన్ తారిక్ వస్తువులు, సేవలపై ఐదు శాతం విలువ ఆధారిత పన్ను చట్టాన్ని జారీ చేస్తూ రాయల్ డిక్రీని జారీ చేశారు. 2018 జనవరిలో పన్ను రేటు అమలులోకి తీసుకొచ్చిన సుల్తానేట్ నాల్గవ గల్ఫ్ దేశంగా గుర్తింపు పొందింది.
తాజా వార్తలు
- కువైట్ ప్రభుత్వ మంత్రిత్వ శాఖల సముదాయం పై డ్రోన్ దాడి
- తెలంగాణ ప్రజలకు అలెర్ట్..
- ఏపీ హై కోర్ట్: విదేశాలకు వెళ్లిన అర్చకులు గర్భగుడిలోకి వెళ్లకూడదు
- ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
- హోర్ముజ్‌లో సముద్ర ఉద్రిక్తతల పై 40కి పైగా దేశాలు ఆందోళన..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..Dh100,000 చొప్పున గెలిచిన ఐదుగురు..!!
- ప్రాంతీయ పరిణామాలను సమీక్షించిన అమీర్, ఇటలీ పీఎం..!!
- సౌదీ కస్టమ్స్ పోర్టులలో 59 రకాల మాదక ద్రవ్యాలు స్వాధీనం..!!
- డ్రోన్ల అమ్మకం, పంపిణీ పై కువైట్ నిషేధం..!!
- మోసపూరిత బీమా కంపెనీలపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక..!!









