గుజరాత్ తీరంలో భారీ స్థాయిలో పట్టుబడ్డ డ్రగ్స్..
- March 07, 2023
గుజరాత్: గుజరాత్ తీరం నుంచి దేశంలోకి అక్రమంగా డ్రగ్స్ తరలించేందుకు యత్నిస్తున్న ముఠాను భారత అధికారులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.425 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్ తీరంలోని అరేబియా సముద్రం మీదుగా దేశంలోకి డ్రగ్స్ రవాణా అవుతున్నాయని ఇంటెలిజెన్స్ సమాచారం అందింది.
దీంతో గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్), తీర రక్షక దళం ఆధ్వర్యంలో సంయుక్తంగా నిఘా పెంచారు. సోమవారం రాత్రి ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిచారు. తీరం వెంట తనిఖీ నిర్వహించారు. ఈ క్రమంలో తీరానికి వంద నాటికల్ మైళ్ల దూరంలో ఒక బోటు అనుమానాస్పదంగా కనిపించింది. వెంటనే అధికారులు బోటును వెంబడించి పట్టుకున్నారు. ఆ బోటులో 61 కిలోల డ్రగ్స్ లభించాయి. ఈ డ్రగ్స్ విలువ రూ.425 కోట్లు ఉంటుందని అంచనా. ఇది ఇరాన్‌కు చెందిన బోటుగా అధికారులు తేల్చారు. బోటులో ఉన్న ఐదుగురు ఇరానియన్లను అరెస్టు చేసి, తీరానికి తీసుకొచ్చారు.
బోటును, డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఈ డ్రగ్స్ తీసుకునేందుకు ప్రయత్నించే ముఠా కోసం కూడా గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వాళ్లను పట్టుకునేందుకు తీరం వెంబడి నిఘా కట్టుదిట్టం చేశారు. ఈ డ్రగ్స్ దందాపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి