అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో హోలీ సేల్..

- March 08, 2023 , by Maagulf
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో హోలీ సేల్..

ఈ-కామర్స్ దిగ్గజాలైన అమెజాన్ , ఫ్లిప్‌కార్ట్ హోలీ సేల్  కొద్దిగంట్లో ముగియనుంది. మార్చి 8వరకు ఈ హోలీ సేల్ అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే స్మార్ట్‌ఫోన్‌లు, వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లపై భారీ డిస్కౌంట్‌లను అందిస్తున్నాయి.ఆపిల్ iPhone 13, Pixel 6a, OnePlus 10 Pro వంటి పాపులర్ డివైజ్‌లపై Amazon, Flipkart ద్వారా తగ్గింపు ధరలకు అందుబాటులో ఉన్నాయి. Oppo Enco X2, AirPodలు వంటి TWS ఇయర్‌ఫోన్‌లపై భారీ డీల్స్ పొందవచ్చు. మీ బడ్జెట్‌ను బట్టి బెస్ట్ డీల్స్ ఇలా పొందవచ్చు.

ఆపిల్ (iPhone 13) మళ్లీ అమ్మకానికి వచ్చింది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా రూ. 60,999 తగ్గింపు ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే, అమెజాన్ ద్వారా అదే డివైజ్ రూ. 60,900కి పొందవచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్‌లపై రూ. 1,500 వరకు తగ్గింపు కూడా ఉంది. అలాగే, EMI లావాదేవీలపై కూడా డిస్కౌంట్ పొందవచ్చు. మరోవైపు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై ఫ్లిప్‌కార్ట్ అదనంగా రూ.2వేల డిస్కౌంట్ అందిస్తోంది. ఆపిల్ అధికారికంగా ఐఫోన్ 13 మోడల్ రూ.69,900 ప్రారంభ ధరతో విక్రయిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ-కామర్స్ సైట్‌లపై దాదాపు రూ. 8,900 తగ్గింపును పొందవచ్చు. గతంలో రూ. 30వేల కన్నా ఎక్కువ ధరకు ఉన్న Pixel 6a ఫోన్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా రూ. 28,999కి కొనుగోలు చేయవచ్చు. మీరు మరికొన్ని రోజులు వేచి ఉంటే.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్  సమయంలో ఈ పిక్సెల్ ఫోన్‌ను చాలా తక్కువ ధరకు పొందవచ్చు. ఈ సేల్ మార్చి 11న ప్రారంభమవుతుంది. కొన్ని Pixel-ప్రత్యేకమైన ఫీచర్‌లతో బెస్ట్ కెమెరా, క్లీన్ సాఫ్ట్‌వేర్ కావాలనుకునే వారికి బెస్ట్ 5G ఫోన్ అని చెప్పవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com