597 మంది మోస్ట్ వాంటెడ్ నేరస్థులు అరెస్ట్

- March 08, 2023 , by Maagulf
597 మంది మోస్ట్ వాంటెడ్ నేరస్థులు అరెస్ట్

దుబాయ్: గత రెండేళ్లలో 101 దేశాలకు చెందిన 597 మంది మోస్ట్ వాంటెడ్ వ్యక్తులను అరెస్టు చేసినట్లు దుబాయ్ పోలీసులు వెల్లడించారు. ఈ విషయాన్ని దుబాయ్ పోలీస్ కమాండర్-ఇన్-చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ అబ్దుల్లా ఖలీఫా అల్ మర్రి ప్రకటించారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో దుబాయ్ పోలీసులు నిర్వహించిన దుబాయ్ వరల్డ్ పోలీస్ సమ్మిట్ (DWPS) రెండవ ఎడిషన్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన పై వివరాలు వెల్లడించారు. అరెస్టయిన వారిలో మనీలాండరింగ్, డ్రగ్ ట్రాఫికింగ్, క్రైమ్ సిండికేట్‌లతో సహా వివిధ నేరాలలో పాల్గొన్న నేరస్థులు ఉన్నారని ఆయన వివరించారు. అదేవిధంగా ఫోర్జరీ, దొంగతనం, అపహరణ ముందస్తు హత్య, సాయుధ దోపిడీ, ఆభరణాల అపహరణ వంటి వివిధ నేరారోపణలకు సంబంధించి విదేశాల్లో ఉన్న 85 మంది వాంటెడ్ పరారీ వ్యక్తులను కూడా స్వదేశానికి రప్పించినట్లు లెఫ్టినెంట్ జనరల్ అల్ మర్రి తెలిపారు.

అంతర్జాతీయ ఏజెన్సీలతో డిపార్ట్‌మెంట్ సహకారంలో భాగంగా.. దుబాయ్ పోలీసులు 9,012 ఇంటెలిజెన్స్, క్రిమినల్ నేరాల్లో 195 దేశాల ప్రభుత్వాలకు.. 60 లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు, సంస్థలకు సహకారం అందించినట్లు పేర్కొన్నారు. 2022లో డెసర్ట్ లైట్ ఆపరేషన్, 2021లో ది ఘోస్ట్ ఆపరేషన్, 2020లో మిల్‌స్ట్రీమ్, 2020లో లాస్ బ్లాంకోస్ వంటి అత్యంత ప్రముఖ ఉమ్మడి కార్యకలాపాలలో పాల్గొన్నట్లు తెలిపారు.

2021లోదుబాయ్ పోలీసులు 70 మిలియన్ యూరోల ($82.6 మిలియన్లు) మాదకద్రవ్యాల అక్రమ రవాణా, స్మగ్లింగ్ కార్యకలాపాలలో పాల్గొన్న ఫ్రెంచ్ డ్రగ్ లార్డ్ అయిన మౌఫైడ్ ‘మౌఫ్’ బౌచిబిని పట్టుకున్నారు. గత 10 సంవత్సరాలు పరారీలో ఉన్న అతడిని దుబాయ్ పోలీసులు అరెస్టు చేసి ఫ్రాన్స్‌కు అప్పగించారు. అదే సంవత్సరంలో దుబాయ్ పోలీసులు ఇటలీకి చెందిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్‌లో ఒకరైన రఫెల్ ఇంపీరియాల్‌ను కూడా అరెస్టు చేశారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com