కార్మికుల వేతనాలకు సంబంధించి 13 వేల ఫిర్యాదులు
- March 08, 2023
మస్కట్: 2022లో కార్మిక మంత్రిత్వ శాఖ (ఎంఓఎల్)కు దాదాపు 24,000 ఫిర్యాదులు అందాయి. కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకారం.. గత సంవత్సరం 13,000 కంటే ఎక్కువ ఫిర్యాదులు వేతనాలకు సంబంధించినవే. అంటే ఉద్యోగుల వేతనాలకు సంబంధించి 50 శాతానికిపైగా ఫిర్యాదులు వచ్చాయి. ఈ సమస్యను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. వేతన రక్షణ వ్యవస్థ (WPS)ని ప్రవేశపెట్టడం ద్వారా కార్మికుల హక్కులను పరిరక్షించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొంది. ఒమన్ విజన్ 2040కి మూలస్తంభంగా ఉన్న ప్రైవేట్ రంగ సంస్థల్లోని కార్మికుల హక్కులను కాపాడేందుకు ఒమన్ సుల్తానేట్ ప్రభుత్వం ప్రణాళికలు, వ్యూహాలకు కార్మిక మంత్రిత్వ శాఖ కీలక సహకారం అందిస్తుంది. కొత్త, క్రమబద్ధమైన భవిష్యత్తు వైపు దేశాన్ని నడిపించే జాతీయ ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేయడం WPS లక్ష్యమని కార్మిక శాఖ పేర్కొంది.
కార్మికులకు న్యాయమైన వేతనాలు అందజేయడమే వేతనాల రక్షణ ప్రధాన ఉద్దేశం. వేతనాల రక్షణ వ్యవస్థ (WPS) అనేది ప్రైవేట్ రంగ వ్యాపారాలలో వేతన చెల్లింపులను పర్యవేక్షించడానికి, ట్రాక్ చేయడానికి కార్మిక మంత్రిత్వ శాఖ , సెంట్రల్ బ్యాంక్ రూపొందించిన ఎలక్ట్రానిక్ విధానం. కార్మికుల జీతాలను వారి బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేయడం ద్వారా కార్మిక చట్టానికి అనుగుణంగా వారికి ఇది హామీ ఇస్తుంది. లేబర్ లా నిర్దేశించిన విధంగా కార్మికులు వారి వేతనాలను పొందుతారని హామీ ఇవ్వడం, అలాగే సామాజిక బీమాలో స్థానిక శ్రామిక శక్తి నమోదు, కార్మికుల వేతనాలను సకాలంలో చెల్లించేలా చేయడం వేతనాల రక్షణ వ్యవస్థ ప్రాథమిక లక్ష్యాలుగా ఉన్నాయి. ఈ వ్యవస్థ స్థిరమైన యజమాని-కార్మికుల సంబంధాన్ని ప్రోత్సహిస్తుందని, ఉత్పాదకతను పెంచుతుందని, వేతన సంబంధిత సంఘర్షణలను తగ్గిస్తుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







