క్రిప్టో కరెన్సీ పై భారత్ కీలక నిర్ణయం

- March 09, 2023 , by Maagulf
క్రిప్టో కరెన్సీ పై భారత్ కీలక నిర్ణయం

న్యూ ఢిల్లీ: అవినీతి భరతం పట్టేందుకు ప్రధాని మోదీ సిద్ధమయ్యారు. పెచ్చు మీరుతున్న అవినీతిని సమూలంగా నిర్మూలించాలనే లక్ష్యంతో క్రిప్టో కరెన్సీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. డిజిటల్ సంపదపై పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేసే లక్ష్యంతో క్రిప్టో కరెన్సీ రంగానికి మనీలాండరింగ్ చట్టాన్ని వర్తింప చేయాలని నిర్ణయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

క్రిప్టో ట్రేడింగ్, సేఫ్ కీపింగ్ సంబంధిత ఫైనాన్షియల్ సర్వీసెస్ కు యాంటీ మనీ లాండరింగ్ చట్టాన్ని వర్తింప చేసినట్లు తెలిపింది. క్రిప్టో కరెన్సీ రంగంపై గతేడాది కఠినమైన పన్ను నిబంధనలను అమలు చేసింది. క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ లెవీని విధించింది. ప్రభుత్వ నిబంధనలతోపాటు అంతర్జాతీయంగా డిజిటల్ అసెట్స్ దెబ్బ తినడంతో మన దేశంలో క్రిస్టో ట్రేడింగ్ పరిణామం తగ్గింది.

బ్యాంకులు, స్టాక్ బ్రోకర్లు యాంటీ మనీ లాండరింగ్ ప్రమాణాలను పాటిస్తారు.ఇదే విధంగా డిజిటల్ అసెట్స్ ప్లాట్ ఫామ్స్ కూడా ఈ ప్రమాణాలను పాటించాలని ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు గట్టిగా చెబుతున్నాయి.భారత ప్రభుత్వం తాజా నిర్ణయాన్ని అమలు చేయాలంటే పకడ్బంది వ్యూహాన్ని అమలు చేయాల్సిందేనని చెబుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com