పంజాబ్ లో 2 వేల గన్ లైసెన్స్ లు రద్దు
- March 12, 2023
పంజాబ్: పంజాబ్ ప్రభుత్వం 2వేల గన్ లైసెన్స్ లను రద్దు చేసింది. గన్ కల్చర్ కు వ్యతిరేకంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ తెలిపారు. తుపాకులు కలిగి ఉండటాన్ని, బహిరంగ కార్యక్రమాలకు, మతపరమైన ప్రదేశాలకు, వివాహ వేడుకలకు, ఇతర కార్యక్రమాలకు ఆయుధాలను తీసుకెళ్లడం, ప్రదర్శించడం నిషేధమని తెలిపారు. రాబోయే రోజుల్లో పోలీసులు వివిధ ప్రాంతాల్లో రాండమ్ చెకింగ్ ను నిర్వహించనున్నట్లు చెప్పారు. పంజాబ్ లో క్షిణిస్తున్న శాంతి భద్రతలను చక్కదిద్దే చర్యలో భాగంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెప్పారు సీఎం. ప్రతిపక్షాల నిరంతర దాడులు, అమృత్ సర్, ఫరీద్ కోట్ లలో లక్ష్యంగా చేసుకున్న హత్యల నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. పంజాబ్ మొత్తంలో 3 లక్షల 73వేల 53 లైసెన్స్డ్ ఆయుధాలు కలిగి ఉన్నాయని తెలిపారు. తుపాకీ సంస్కృతిని అంతం చేసేందుకు పంజాబ్ ప్రభుత్వం నిరంతర చర్యలు తీసుకుంటోందని చెప్పారు.
తాజా వార్తలు
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!







