చిరంజీవి పుత్రోత్సాహం.! ఆనందంలో తేలిపోతున్న చిరంజీవి.!

- March 13, 2023 , by Maagulf
చిరంజీవి పుత్రోత్సాహం.! ఆనందంలో తేలిపోతున్న చిరంజీవి.!

తెలుగు సినిమా గొప్పతనం ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలన్నది చిరంజీవి కోరిక. ఆ కోరిక రాజమౌళి రూపంలో నెరవేరిందని గతంలో ఓ సారి చిరంజీవి చెప్పారు. 

అందుకు రాజమౌళిని ప్రత్యకంగా ప్రశంసించి గౌరవించారు చిరంజీవి. ఇక, తాజాగా రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ బరిలో నిలిచింది. అవార్డు కొల్లగొట్టింది కూడా.

ఈ కథలో తన పుత్రుడు రామ్ చరణ్ కూడా భాగం కావడం చిరంజీవిని పుత్రోత్సాహంలో నింపేసింది. గర్వంతో ఉప్పొంగిపోతున్నాడు మెగాస్టార్ చిరంజీవి. 

తాను సాధించాలనుకున్నది పుత్రుని రూపంలో నెరవేరితే.. ఆ తండ్రికి అంతకన్నా గొప్ప అచీవ్‌మెంట్ ఇంకేముంటుంది. మెగాస్టార్ చిరంజీవి ఆ అచీవ్‌మెంట్ అందుకున్నాడు. అంతకన్నా గర్వం ఇంకేముంటుంది చిరంజీవికి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com