‘రానా నాయుడు’.! ఫ్యాన్సే ఛీ కొడుతున్నారు వెంకీ మామా.!
- March 13, 2023
సినిమాల్లో బూతు కంటెంట్‌కి సెన్సార్ వుంటుంది. కానీ, వెబ్ సిరీస్‌లలో సెన్సార్ కట్స్ లేవు. దాంతో, వెబ్ సిరీస్ అంటే, బూతు కంటెంట్ వుండొచ్చు. అలా అని అన్ని వెబ్ సిరీస్‌లూ బూతు కంటెంట్ సిరీస్‌లే అని చెప్పలేం.
‘ఆ’ కంటెంట్ లేకుండా కూడా కొన్ని క్లీన్ వెబ్ సిరీస్‌లు మంచి పేరు తెచ్చుకుంటున్నాయ్. ప్రేక్షకుల మెప్పు పొందుతున్నాయ్.
అయితే, సీనియర్ స్టార్ వెంకటేష్, రానా కాంబినేషన్లో వచ్చిన ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ గురించీ, అందులోని బూతు కంటెంట్ గురించీ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కాదు కాదు, ప్రత్యేకంగా తిట్టుకోవాలి. అదే జరుగుతోంది సోషల్ మీడియాలో.
తనకున్న ఫ్యామిలీ ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది ఈ సిరీస్‌తో వెంకటేష్‌కి. అలాగే రానా కూడా. దగ్గుబాటి ఫ్యామిలీ పరువు పోయింది.. ఈ వెబ్ సిరీస్‌లో నటించడం వల్ల అనే అభిప్రాయాలు వస్తున్నాయ్.
అవును నిజమే, మరీ ఇంత కక్కుర్తి ఎందుకు పడ్డారబ్బా.. వెంకీ, రానా. ‘ఛీ.! థూ.!’ అంటూ తిట్టి పోస్తున్నారు ఈ వెబ్ సిరీస్ చూసిన ప్రేక్షకులు. అంత జుగుప్సాకరంగా ఈ సిరీస్ మొత్తం అనవసరమైన బూతుతో నిండిపోయింది మరి.
తాజా వార్తలు
- జస్టిస్ సూర్యకాంత్ కొత్త సీజేఐ!
- ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ఆధ్వర్యంలో “దండక సాహిత్యం–ఉనికి, ప్రాభవం' సభ విజయవంతం
- నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ: సీఎం చంద్రబాబు
- నవంబర్‌లో బ్యాంకులకు సెలవులే సెలవులు
- చట్టపరమైన రాజీ ప్రక్రియకు @ తరధీ యాప్..!!
- ఖతార్‌లో ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లలో తనిఖీలు..!!
- GDRFA దుబాయ్ కు 'ఉత్తమ AI గవర్నెన్స్ స్ట్రాటజీ' అవార్డు..!!
- కువైట్ లో HIV టెస్ట్ రిజల్ట్స్ ఫోర్జరీ..!!
- ఒమన్‌లో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ క్యాంపింగ్ ఏరియా..!!
- నకిలీ జాబ్, సామాజిక బీమా మోసం కేసులో ఐదుగురికి శిక్ష..!!







