రమదాన్ 2023: ప్రైవేట్ రంగ ఉద్యోగులకు పని వేళలు తగ్గింపు
- March 13, 2023
యూఏఈ: పవిత్ర రమదాన్ మాసంలో ప్రైవేట్ రంగ ఉద్యోగుల కోసం యూఏఈ మానవ వనరులు, ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ (MoHRE) అధికారిక పని వేళలను ప్రకటించింది. పవిత్ర మాసంలో పని వేళలను రెండు గంటలు తగ్గించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. సాధారణంగా, ప్రైవేట్ రంగ ఉద్యోగులు రోజుకు ఎనిమిది గంటలు లేదా వారానికి 48 గంటలు పని చేస్తారు. కానీ రమదాన్ మాసంలో ఇది రోజుకు ఆరు గంటలు లేదా వారానికి 36 గంటలకు తగ్గించబడుతుంది. వివిధ కారణాల వల్ల ఏవరైనా అదనపు గంటలపాటు పని చేస్తే ఆ సమయాలను ఓవర్‌టైమ్‌గా పరిగణించి.. అదనంగా చెల్లించాల్సి ఉంటుందని మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇంతకుముందు, ఫెడరల్ అథారిటీ ఫర్ గవర్నమెంట్ హ్యూమన్ రిసోర్సెస్ (FAHR) ఫెడరల్ అధికారుల ఉద్యోగుల కోసం పవిత్ర రమదాన్ మాసంలో అధికారిక పని వేళలను నిర్ణయిస్తూ సర్క్యులర్‌ను జారీ చేసింది. సర్క్యులర్ ప్రకారం, మంత్రిత్వ శాఖలు, సమాఖ్య అధికారుల అధికారిక పని గంటలు సోమవారం నుండి గురువారం వరకు ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2.30 వరకు.. శుక్రవారం ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటాయి.
తాజా వార్తలు
- స్లీపర్ బస్సులో.. మంటలు ముగ్గురు మృతి,పలువురికి గాయాలు
- ప్రపంచ తెలుగు మహాసభలు..పెయింటింగ్స్‌కు ఆహ్వానం
- జేడీయూ షాక్ నిర్ణయం: 16 మంది నేతలకు బహిష్కరణ
- 3వ ప్రపంచ తెలుగు మహాసభలు–2026 ముఖ్యాంశాలు
- హరీశ్ రావు తండ్రి భౌతిక కాయానికి నివాళులర్పించిన కేసీఆర్..
- తీవ్ర తుపానుగా ‘మొంథా’.. ఏపీలో హైఅలర్ట్..
- దుబాయ్: ఏపీ మంత్రి టి.జి భరత్ తో మీట్ & గ్రీట్ ఏర్పాటు చేసిన INDEX ఎమిరేట్స్ గ్రూప్
- తెలుగు టైటాన్స్ vs పట్నా పైరేట్స్ పోరు
- యూఏఈలోని భారతీయ ప్రవాసులకు కొత్త చిప్‌తో కూడిన ఈ-పాస్‌పోర్ట్‌లు
- సౌదీలో 44 కొత్త ప్రొఫేషన్స్ లో స్థానికీకరణ అమలు..!!







