ఢిల్లీ-దోహా ఇండిగో విమానం: కరాచీలో అత్యవసరంగా ల్యాండింగ్
- March 13, 2023
దోహా: మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ఢిల్లీ నుంచి టేకాఫ్ అయిన ఇండిగో విమానాన్ని పాకిస్థాన్‌లోని కరాచీ విమానాశ్రయానికి మళ్లించారు. ఢిల్లీ-దోహా విమానం 6E-1736 ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానాన్ని పైలట్ అత్యవసర ల్యాండింగ్ అనుమతి కోరడంతో సోమవారం తెల్లవారుజామున కరాచీలోని జిన్నా టెర్మినల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించారు. 60 ఏళ్ల నైజీరియా పౌరుడిని పరీక్షించిన విమానాశ్రయ వైద్య బృందం మరణించినట్లు ప్రకటించారు. నాలుగు గంటల తర్వాత విమానం దోహా బయలుదేరి వెళ్లింది. "ఇండిగో ఫ్లైట్ 6E-1736, ఢిల్లీ నుండి దోహాకు వెళ్లే క్రమంలో.. విమానంలో మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా కరాచీకి మళ్లించబడింది. దురదృష్టవశాత్తు, విమానంలో ప్రయాణీకుడు మరణించినట్లు ఎయిర్ పోర్ట్ వైద్య బృందాలు ప్రకటించాయి." అని ఇండిగో ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటన విడుదల చేసింది
తాజా వార్తలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!







