తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల కోసం ప్రత్యేక యాప్..
- March 14, 2023
హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం ప్రత్యేక యాప్ ను తీసుకొచ్చారు. విద్యార్థుల కోసం ఇంటర్మీడియట్ బోర్డు ప్రత్యేక యాప్ ను రూపొందించింది. ఈ ప్రత్యేక యాప్ ద్వారా ఎగ్జామ్ సెంటర్ ను సులువుగా తెలుసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఎగ్జామ్ సెంటర్ లోకేటర్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ ద్వారా ఎగ్జామ్ సెంటర్ లోకేషన్ ఈజీగా తెలుసుకోవచ్చు. దీంతో ఎలాంటి టెన్షన్ లేకుండా సులువుగా సమయానికి ఎగ్జామ్ సెంటర్ కు చేరుకోవచ్చు.
బుధవారం నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవ్సతరం పరీక్షలు, గురువారం నుంచి ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ రెండో సంవ్సతరం పరీక్షలు ప్రారంభం అవుతాయి. మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు జరుగనున్న పరీక్షలకు అధికారుులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది 9,47,699 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 4,82,677 మంది ఫస్టియర్ విద్యార్థులు కాగా, 4,65,022 మంది సెకండియర్ విద్యార్థులు ఉన్నారు.
ఉదయం 9 గంటలకు నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 3 గంటల పాటు పరీక్షలు జరుగనున్నాయి. పరీక్షల నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తంగా 1,473 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్థుల సౌకర్యార్ధం రెండు కంట్రోల్ రూమ్ నెంబర్లు 040-24601010, 040-24644027ను ఏర్పాటు చేశారు. ఎప్పటిలాగే నిమిషం నిబంధన ఉంటుందని, ఆలస్యంగా వచ్చే విద్యార్థులను అనుమతించబోమని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఏపీలో భారీగా పెరిగిన వాహనాల అమ్మకాలు..!
- తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ మహిళలకు ఆర్థిక సాయం
- ఫల, పుష్ప ప్రదర్శన, మీడియా సెంటర్ ప్రారంభించిన టీటీడీ చైర్మన్
- ఖలిస్థానీ ఉగ్రవాది నుంచి మోదీకి బెదిరింపులు
- మక్కా గ్రాండ్ మసీదులో గ్రాండ్ ముఫ్తీ అంత్యక్రియ ప్రార్థనలు..!!
- న్యూయార్క్ వేదికగా పలు దేశాలతో ఒమన్ కీలక ఒప్పందాలు..!!
- UAE గోల్డెన్ వీసాకు H-1B వీసా బూస్ట్..!!
- కువైట్ లో ఇల్లీగల్ రెసిడెన్సీ అడ్రస్ మార్పు.. నెట్వర్క్ బస్ట్..!!
- బహ్రెయిన్ లో పలు దేశాలకు చెందిన 19 మంది అరెస్టు..!!
- ఖతార్ T100 కిక్ ఆఫ్ రన్ షెడ్యూల్ రిలీజ్..!!