దోహాలో కైట్ ఫెస్టివల్ సందడి
- March 16, 2023
దోహా: దోహాలో కైట్ ఫెస్టివల్ సందడి ప్రారంభమైంది. వివిధ రకాల రంగులు, ఆకారాలు, పరిమాణాలు, డిజైన్‌లలో రూపొందించిన గాలిపటాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా డంబో పిల్ల ఏనుగు, చార్లీ చాప్లిన్, డుగాంగ్, పెంగ్విన్, స్టింగ్రే వంటి విభిన్న జంతువుల ఆకారాల గాలిపటాలు పిల్లలను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. సేఫ్ ఫ్లైట్ సొల్యూషన్స్ సీఈ, ఖతార్ కైట్ ఫెస్టివల్ నిర్వాహకుడు హసన్ అల్ మౌసావి మాట్లాడుతూ.. ఫెస్టివల్ మొదటి ఎడిషన్ కోసం 40 మందికి పైగా ప్రొఫెషనల్ కైట్ ఫ్లైయర్స్ ప్రపంచం నలుమూలల నుండి దోహాకు వచ్చారని చెప్పారు. జర్మనీ, థాయ్‌లాండ్, టర్కీ, ఫ్రాన్స్, ఇటలీ, ఇండియా, ఇండోనేషియా, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్ నుండి 16 కంటే ఎక్కువ జట్లు ఈవెంట్ లో పోటీ పడుతున్నాయని తెలిపారు. మూడు రోజులపాటు జరుగనున్న కైట్ ఫెస్టివల్ మ్యూజియం ఆఫ్ ఇస్లామిక్ ఆర్ట్ (MIA) పార్క్ హిల్స్‌లో నిర్వహించబడుతుందన్నారు. మార్చి 16 నుండి 17 వరకు మధ్యాహ్నం 3 నుండి రాత్రి 9 గంటల వరకు.. మార్చి 18న ఉదయం 11 నుండి రాత్రి 9 గంటల వరకు జరుగుతుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..