మళ్లీ పెరిగిపోతున్న కోవిడ్ కేసులు..
- March 16, 2023
న్యూ ఢిల్లీ: కోవిడ్ కేసులు పెరగకుండా నియంత్రణ చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది. టెస్టింగ్, వ్యాక్సినేషన్, చికిత్స, ట్రాకింగ్ వంటివి వేగంగా నిర్వహించాలని సూచించింది. కోవిడ్ వ్యాప్తి అరికట్టేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. ఇటీవలి కాలంలో ఒక్క రోజులోనే 700కు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీనిపై కేంద్రం ఆందోళనవ్యక్తం చేసింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 4,623కు చేరింది. గత నవంబర్ తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. నాలుగు నెలల తర్వాత మళ్లీ కేసులు పెరిగాయి. చివరగా గత నవంబర్ 12న 734 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత నుంచి కేసుల సంఖ్య తగ్గుతూ వచ్చింది.
ప్రస్తుతం కేసులు పెరుగుతున్న దృష్ట్యా మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించింది. జిల్లా స్థాయిలోనూ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రస్తుతం కేసుల శాతం 0.01గా ఉంది. జాతీయ రికవరీ రేటు 98.80గా ఉంది. దేశంలో కోవిడ్ మరణాల శాతం 1.19గా ఉంది. ఇప్పటివరకు కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,41,57,297గా ఉంది. దేశంలో మొత్తం 220.64 కోట్ల వ్యాక్సిన్లు పూర్తయ్యాయి.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి