గల్ఫ్ వలసల అవగాహన, డిమాండ్ల పోస్టర్ విడుదల

- March 17, 2023 , by Maagulf
గల్ఫ్ వలసల అవగాహన, డిమాండ్ల పోస్టర్ విడుదల

తెలంగాణ: తెలంగాణ బిజెపి ఎన్నారై సెల్ గల్ఫ్ మిడిల్ ఈస్ట్ కన్వీనర్ నరేంద్ర పన్నీరు శుక్రవారం జగిత్యాల ప్రెస్ క్లబ్ లో గల్ఫ్ వలసల అవగాహన పోస్టర్ విడుదల చేశారు.ఈ కార్యక్రమానికి బిజెపి నాయకులు గల్ఫ్ మిడిల్ ఈస్ట్ కన్వీనర్ పన్నీరు నరేంద్ర బిజెపి జిల్లా అధ్యక్షులు మోరపెల్లి సత్యనారాయణ రావు, మాజీ మున్సిపల్ చైర్మన్ భోగ శ్రావణి,భూమి రమణ, మధన్ మోహన్,రాగిల్ల సత్యనారాయణ,తిరుపతి రెడ్డి మరియు దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు నక్క,జీవన్ బిర్పూర్ మండల ఓబీసీ మోర్చ అధ్యక్షులు బసవరాజుల సంతోష్, చందుర్తి మండల బీజేపీ ఉపాధ్యక్షుడు వంకాయల కార్తీక్,కొడిమ్యాల మండలం ఐటి కన్వీనర్,చందుర్తి మండల బీజేవైఎం అధ్యక్షుడు అంబల శ్రీకాంత్,మరియు బీజేపీ కార్యకర్తలు పిట్ల రాజన్న,వి.ఎస్.ఎస్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. గల్ఫ్ వలసల నిపుణులు మంద భీంరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

సమగ్ర ఎన్నారై, మైగ్రేషన్ పాలసీలో భాగంగా... తెలంగాణ గల్ఫ్ వలస కార్మికుల రక్షణ, సంక్షేమం కొరకు తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి నరేంద్ర పన్నీరు విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం గల్ఫ్ మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని, గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి రూ. 500 కోట్ల వార్షిక బడ్జెట్ కేటాయించాలని, రేషన్ కార్డుల నుండి, ఓటర్ లిస్ట్ నుండి గల్ఫ్ కు వెళ్లిన వలస కార్మికుల పేర్లు తొలగించవద్దని ఆయన కోరారు. 

హైదరాబాద్ లో సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్ దేశాల కాన్సులేట్ లు (రాయబార కార్యాలయాలు) ఏర్పాటు అయ్యేలా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని నరేంద్ర కోరారు. ప్రవాస భారతీయ బీమా యోజన అనే రూ.10 లక్షల విలువైన ప్రమాద బీమా పథకంలో సహజ మరణంను కూడా చేర్చాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. విదేశాల నుండి వాపస్ వచ్చినవారు జీవితంలో స్థిరపడటానికి పునరావాసం, పునరేకీకరణ కొరకు ప్రత్యేక పథకాల రూపకల్పన చేయాలని, జైళ్లలో మగ్గుతున్న ప్రవాసులకు న్యాయ సహాయం (లీగల్ ఎయిడ్) ఇవ్వాలని కోరారు. 

గల్ఫ్ దేశాల్లో ఇబ్బందుల్లో ఉన్న కార్మికులు సహాయం కోసం, సలహా కోసం ఢిల్లీ లోని ప్రవాసి భారతీయ సహాయత కేంద్రం వారి ల్యాండ్ లైన్ నెంబర్లు +91 11 4050 3090 & +91 11 2688 5021 కాల్ చేయాలని నరేంద్ర సూచించారు. ఇండియాలో ఉన్న కుటుంబ సభ్యులు కాల్ చేయవలసిన  టోల్ ఫ్రీ నెంబర్1800 11 3090 హైదరాబాద్ లోని క్షేత్రీయ ప్రవాసి సహాయత కేంద్రం +91 40 2777 2557 నెంబర్లకు కాల్ చేయాలి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com