రమదాన్ 2023: అనుమతి లేకుండా ఇఫ్తార్.. Dh100,000 జరిమానా

- March 18, 2023 , by Maagulf
రమదాన్ 2023: అనుమతి లేకుండా ఇఫ్తార్.. Dh100,000 జరిమానా

యూఏఈ: దుబాయ్‌లోని నివాసితులకు పవిత్ర రమదాన్ మాసంలో ఇఫ్తార్ భోజనాలు పంపిణీ చేయడానికి అనుమతులు అవసరం. దుబాయ్‌లోని ఇస్లామిక్ అఫైర్స్ అండ్ ఛారిటబుల్ యాక్టివిటీస్ డిపార్ట్‌మెంట్ శుక్రవారం విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించింది. ఆహార పంపిణీపై అవసరమైన నిబంధనలను అనుసరించాలని ప్రజలకు సూచించింది. ఏదైనా వ్యక్తి లేదా సంస్థ అనుమతి లేకుండా భోజనం పంపిణీ చేస్తే అనధికార స్వచ్ఛంద చర్యగా పరిగణించబడుతుందని ఇస్లామిక్ అఫైర్స్ అండ్ ఛారిటబుల్ యాక్టివిటీస్ డిపార్ట్‌మెంట్ స్వచ్ఛంద కార్యకలాపాల డిప్యూటీ డైరెక్టర్ మహమ్మద్ మొసబ్ దాహి తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా ఆడియో, విజువల్ లేదా ప్రింట్ మీడియా ద్వారా విరాళాలు లేదా ప్రకటనల సేకరణకు సంబంధించిన ఏదైనా చర్యల నిషేధం కిందకు వస్తాయని పేర్కొన్నారు. లైసెన్స్ లేకుండా ప్రకటనలు లేదా విరాళాలు సేకరించినందుకు జరిమానాలు  Dh5,000 - Dh 100,000 మధ్య జరిమానాలతోపాటు లేదా ఒక నెల కంటే తక్కువ కాకుండా ఒక సంవత్సరం కంటే ఎక్కువ జైలు శిక్ష లేదా రెండు శిక్షలను ఏకకాలంలో విధించే అవకాశం ఉందని మొసబ్ దాహి తెలిపారు. 

ఎలా దరఖాస్తు చేయాలంటే..

మీరు iacad.gov.aeని సందర్శించి, వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా 800600కి కాల్ చేయవచ్చు. ఎమిరేట్స్ ID, పంపిణీ స్థానాన్ని అధికారులకు తెలపడంతోపాటు ఆహారం సేకరించే రెస్టారెంట్ పేరు, ఆహారం తీసుకునే పాయింట్ వివరాలు నమోదు చేసి అవసరమైన అనుమతులను పొందవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com