ఫార్ములా 1 రేసుకు సిద్ధమైన జెడ్డా

- March 18, 2023 , by Maagulf
ఫార్ములా 1 రేసుకు సిద్ధమైన జెడ్డా

జెడ్డా : ఫార్ములా 1లో అత్యంత వేగవంతమైన స్ట్రీట్ సర్క్యూట్ అయిన కార్నిచ్ సర్క్యూట్.. ఎస్టీసీ సౌదీ అరేబియా గ్రాండ్ ప్రిక్స్ 2023కి ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధమైంది. జెద్దా మూడోసారి F1 రేస్ కు ఆతిథ్యం ఇస్తుంది. ఇది ఈ వారాంతం మార్చి 17, 18, 19వ తేదీల్లో సందడి చేయనుంది. 6.174 కి.మీ పొడవు ఉన్న ఈ సర్క్యూట్ సగటు వేగం గంటకు 250 కి.మీ.. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన, పొడవైన స్ట్రీట్ సర్క్యూట్ ఎర్ర సముద్రం తీరంలో ఉన్న జెడ్డా వాటర్‌ఫ్రంట్‌లో రేసు డ్రైవర్లు పోటీ పడనున్నారు. బహ్రెయిన్‌లో జరిగిన రేసు తర్వాత 2023లో ఫార్ములా 1 క్యాలెండర్‌లో జెడ్డా రెండవ స్థానంలో ఉంది. 10 జట్ల నుంచి ఇరవై మంది డ్రైవర్లు టైటిల్ కోసం పోటీ పడేందుకు సిద్ధంగా ఉన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com