శాకుంతలం నుండి మోహన్ బాబు లుక్ రిలీజ్
- March 18, 2023హైదరాబాద్: శాకుంతలం నుండి మోహన్ బాబు లుక్ ను రిలీజ్ చేసారు మేకర్స్. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మూవీ శాకుంతలం. గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ సినిమాలో సమంత కీ రోల్ చేస్తుండగా..మలయాళ యంగ్ హీరో దేవ్ మోహన్ దుష్యంతుడిగా నటిస్తున్నాడు. ఈ సినిమాను సమ్మర్ కానుకగా ఏప్రిల్ 14 న రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో మేకర్స్ సినిమా ప్రమోషన్ ఫై దృష్టి సారించారు. ఇప్పటికే పలువురి ఫస్ట్ లుక్ లు , టీజర్ , సాంగ్స్ రిలీజ్ చేసి ఆకట్టుకోగా..శనివారం సినిమాలోని మోహన్ బాబు లుక్ ను రిలీజ్ చేసారు.
దుర్వాసముని పాత్రలో మోహన్ బాబు కనిపించబోతున్నారు. తెల్లటి పొడవాటి గడ్డం పైన కొప్పు.. మెడలో రుద్రాక్ష మాల ఓ చేతిలో చెంబు మరో చేతిలో యోగ దండం కాషాయ బట్టలు చెక్క చెప్పులో అదిరిపోయారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ గా మారింది. భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కించిన శాకుంతలం సినిమాకు గుణ శేఖర్ దర్శకత్వం వహించగా మెలోడీ బ్రహ్మా మణిశర్మ సంగీతం అందించారు. ఈ చిత్రంలో దేవ్ మోహన్, మోహన్ బాబు, ప్రకాశ్ రాజ్, గౌతమి, అదితి బాలన్, అనన్య నాగల్ల, కబీన్ దుహన్ సింగ్ కీలక పాత్రలు పోషించారు. ఇక చిట్టి భరతుడి పాత్రలో అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ నటించింది.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!