శాకుంతలం నుండి మోహన్ బాబు లుక్ రిలీజ్
- March 18, 2023
హైదరాబాద్: శాకుంతలం నుండి మోహన్ బాబు లుక్ ను రిలీజ్ చేసారు మేకర్స్. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మూవీ శాకుంతలం. గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ సినిమాలో సమంత కీ రోల్ చేస్తుండగా..మలయాళ యంగ్ హీరో దేవ్ మోహన్ దుష్యంతుడిగా నటిస్తున్నాడు. ఈ సినిమాను సమ్మర్ కానుకగా ఏప్రిల్ 14 న రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో మేకర్స్ సినిమా ప్రమోషన్ ఫై దృష్టి సారించారు. ఇప్పటికే పలువురి ఫస్ట్ లుక్ లు , టీజర్ , సాంగ్స్ రిలీజ్ చేసి ఆకట్టుకోగా..శనివారం సినిమాలోని మోహన్ బాబు లుక్ ను రిలీజ్ చేసారు.
దుర్వాసముని పాత్రలో మోహన్ బాబు కనిపించబోతున్నారు. తెల్లటి పొడవాటి గడ్డం పైన కొప్పు.. మెడలో రుద్రాక్ష మాల ఓ చేతిలో చెంబు మరో చేతిలో యోగ దండం కాషాయ బట్టలు చెక్క చెప్పులో అదిరిపోయారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ గా మారింది. భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కించిన శాకుంతలం సినిమాకు గుణ శేఖర్ దర్శకత్వం వహించగా మెలోడీ బ్రహ్మా మణిశర్మ సంగీతం అందించారు. ఈ చిత్రంలో దేవ్ మోహన్, మోహన్ బాబు, ప్రకాశ్ రాజ్, గౌతమి, అదితి బాలన్, అనన్య నాగల్ల, కబీన్ దుహన్ సింగ్ కీలక పాత్రలు పోషించారు. ఇక చిట్టి భరతుడి పాత్రలో అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ నటించింది.
తాజా వార్తలు
- హైదరాబాద్లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- DP World to develop strategic border facilities in Afghanistan under landmark agreement
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!







