తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
- March 18, 2023ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌తోపాటు అనేక ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఏపీలోని అనేక జిల్లాల్లోనూ భారీగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల వడగళ్ల వాన కురుస్తోంది.
హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, శేరిలింగం పల్లి, కూకట్ పల్లితోపాటు నగర శివారు ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తోంది. వర్షం ప్రభావంతో రోడ్లపై నీళ్లు నిలిచిపోయి, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగితోపాటు, చుట్టుపక్కల ప్రాంతాల్లో, కరీంనగర్ జిల్లా చొప్పదండిలో వడగళ్ల వర్షం కురిసింది. సంగారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది. ఏపీకి సంబంధించి ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలో వడగళ్ల వాన పడింది. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో వర్షం బీభత్సం సృష్టించింది.
శింగనమల, నార్పల, నాయనపల్లి క్రాస్ రోడ్ ప్రాంతాల్లో పంట నష్టం జరిగింది. భారీ వర్షాలకు వరి, అరటి పంటలు దెబ్బతిన్నాయి. కడప జిల్లా పులివెందులలో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలుతో కూడిన వర్షం పడటం వల్ల రోడ్లన్నీ జలమయమయ్యాయి. మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్‌తోపాటు తెలంగాణలోని అనేక ప్రాంతాలు, ఏపీలోని అనేక జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. రెండు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ తెలంగాణకు యెల్లో అలెర్ట్ జారీ చేసింది.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?