ఒమన్ సుల్తానేట్‌లో సోమవారం భారీ వర్షాలు!
- March 19, 2023
మస్కట్: సుల్తానేట్ ఆఫ్ ఒమన్‌లోని దక్షిణ గవర్నరేట్‌లలో సోమవారం నుండి మంగళవారం ఉదయం వరకు భారీ వర్షాలు కురుస్తాయని ఒమన్ వాతావరణ శాఖ వెల్లడించింది. సోమవారం మధ్యాహ్నం నుంచి మంగళవారం ఉదయం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తాజాగా పౌర విమానయాన అథారిటీ (CAA) ఒక హెచ్చరికను జారీ చేసింది. ధోఫర్, అల్ వుస్తా, సౌత్ అల్ షర్కియా గవర్నరేట్‌లు వర్షాల కారణంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందన్నారు. హెచ్చరిక వ్యవధి ముగిసే వరకు లోయలు దాటడం, లోయలను సందర్శించడం, సముద్రంలోకి వెళ్లడం మానుకోవాలని పౌరులను కోరింది. అరేబియా సముద్రం, ఆగ్నేయ తీరాలలో అలలు 1.5 నుండి 3 మీటర్ల ఎత్తులో ఉండవచ్చని ఒమన్ వాతావరణ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- క్రిప్టో కరెన్సీ, బ్లాక్ చైన్ సహా సరికొత్త ఆర్థిక నేరాలపై ఫోకస్: డీజీపీ అంజనీ కుమార్
- ముగిసిన హెచ్-1బీ వీసా అప్లికేషన్లు..
- మెక్సికో నగరంలో ఘోర అగ్నిప్రమాదం..39 మంది మృతి
- హైదరాబాద్ లో ఆస్కార్ విజేత చంద్రబోస్కు సత్కారం..
- జీ-20 సదస్సు-2023కు విశాఖ రెడీ
- ప్రజాగ్రహంతో దిగొచ్చిన ఇజ్రాయెల్ ప్రధాని..
- హైదరాబాద్ నగరాన్ని ఆహ్లాదకరంగా మార్చేందుకు కృషి
- పాన్-ఆధార్ లింక్ గడువు పెంపు..
- అదనపు ఆదాయాన్నిచ్చే ‘సెకండ్ శాలరీ’..!
- ఆకాశంలో కనువిందు చేయనున్న 5 గ్రహాలు..!