80% టాక్సీలు స్ట్రీట్ హెయిలింగ్ నుండి ఈ-హెయిలింగ్‌కి మార్పు!
- March 19, 2023
యూఏఈ: సాంప్రదాయ టాక్సీ స్ట్రీట్-హెయిల్ నుండి ఈ-హెయిలింగ్ సేవలకు క్రమంగా మార్పు కోసం ఒక ప్రణాళికను ఆమోదించినట్లు దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) తెలిపింది. ఇది రాబోయే సంవత్సరాల్లో 80 శాతం ఇ-హెయిల్ స్వీకరణ రేటును లక్ష్యంగా చేసుకున్న పేర్కొంది. 2022లో దుబాయ్‌లో జరిగిన మొత్తం టాక్సీ ట్రిప్పుల్లో 30 శాతం హలా ఇ-హెయిలింగ్ రైడ్‌లు విజయవంతం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీఏ ఆదివారం ప్రకటించింది. RTA డైరెక్టర్ జనరల్, బోర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ చైర్మన్ మట్టర్ అల్ టేయర్ మాట్లాడుతూ.. స్ట్రీట్-హెయిలింగ్‌కు విరుద్ధంగా టాక్సీ ఇ-హెయిల్ సేవల విస్తరణ, దుబాయ్‌ని ప్రపంచంలోనే అత్యంత తెలివైన నగరంగా మార్చాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని బలపరుస్తుందన్నారు. ఇ-హెయిల్ టాక్సీ సేవ దుబాయ్‌లో ట్యాక్సీ కార్యకలాపాల సామర్థ్యాన్ని లొకేటింగ్, బుకింగ్ ప్రక్రియను క్రమబద్ధీకరించడం ద్వారా పెంచుతుందని తెలిపారు. ఎలక్ట్రానిక్ రైడ్‌లు 3.5 నిమిషాలు లేదా అంతకంటే తక్కువ నిరీక్షణ సమయాలతో అధిక శాతం ప్రయాణాలకు వీలవుతుందన్నారు. కస్టమర్‌లు ఇ-పేమెంట్, సరైన రూట్ ఎంపిక, ట్రిప్-షేరింగ్ ఆప్షన్‌లు, డ్రైవర్, వెహికల్ వివరాలకు యాక్సెస్, సర్వీస్, డ్రైవర్ రెండింటినీ రేట్ చేయగల సామర్థ్యం వంటి ఇతర ఫీచర్‌ల నుండి కూడా ప్రయోజనం పొందవచ్చన్నారు.
105 మిలియన్ ప్రయాణాలు
స్ట్రీట్-హెయిల్డ్ టాక్సీ ట్రిప్‌ల నుండి ఇ-హెయిలింగ్ సేవలకు మారడం అనేది పరిశ్రమలోని ప్రముఖ ప్రపంచ పద్ధతులకు అనుగుణంగా ఉంటుందని అల్ టేయర్ తెలిపారు. 2020లో మొత్తం టాక్సీ ప్రయాణాల్లో 11 శాతం, 2021లో 18 శాతానికి, 2022లో 30 శాతానికి చేరుకున్నాయని తెలిపారు. అంతకుముందు సంవత్సరంలో దుబాయ్‌లో నడిచే 11,662 టాక్సీలు 105 మిలియన్ ట్రిప్పులను పూర్తి చేశాయని అల్ టేయర్ వివరించారు.
ఎలా బుక్ చేసుకోవాలి?
> వినియోగదారులు తమ మొబైల్ పరికరాలలో కరీమ్(Careem) యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి.వ్యక్తిగత ఖాతాను సెటప్ చేయాలి. అందుబాటులో ఉన్న ఎంపికల నుండి హలా వాహనాలను ఎంచుకోవచ్చు. వారి పికప్ స్థానాన్ని నిర్ధారించవచ్చు.
> గమ్యస్థానం, ప్రాధాన్య చెల్లింపు పద్ధతిని ఎంచుకున్న తర్వాత, బుకింగ్‌ను ఖరారు చేయడానికి వినియోగదారులు 'Yalla' బటన్‌ను నొక్కాలి.
> డ్రైవర్, బుకింగ్ సమాచారాన్ని కలిగి ఉన్న సందేశం మొబైల్ కి వస్తుంది.
ఇ-హెయిల్ సర్వీస్ 10 సెకన్లలోపు బుకింగ్‌లను ఓకే చేసి అందుబాటులో ఉన్న అత్యంత సమీపంలో ఉన్న వాహనాన్ని గుర్తించడం, ప్రయాణాన్ని పర్యవేక్షించడం వంటి అనేక రకాల ఫీచర్‌లను అందిస్తుంది. దీంతోపాటు ఈ సేవ ఇ-హెయిల్ సిస్టమ్ ద్వారా వినియోగదారు అభ్యర్థనలను స్వీకరించడానికి అనుమతించడం ద్వారా డ్రైవర్ల కోసం ప్రక్రియను క్రమబద్ధీకరిస్తుందని ఆర్టీఏ తెలిపింది.
తాజా వార్తలు
- క్రిప్టో కరెన్సీ, బ్లాక్ చైన్ సహా సరికొత్త ఆర్థిక నేరాలపై ఫోకస్: డీజీపీ అంజనీ కుమార్
- ముగిసిన హెచ్-1బీ వీసా అప్లికేషన్లు..
- మెక్సికో నగరంలో ఘోర అగ్నిప్రమాదం..39 మంది మృతి
- హైదరాబాద్ లో ఆస్కార్ విజేత చంద్రబోస్‌కు సత్కారం..
- జీ-20 సదస్సు-2023కు విశాఖ రెడీ
- ప్రజాగ్రహంతో దిగొచ్చిన ఇజ్రాయెల్ ప్రధాని..
- హైదరాబాద్ నగరాన్ని ఆహ్లాదకరంగా మార్చేందుకు కృషి
- పాన్-ఆధార్ లింక్ గడువు పెంపు..
- అదనపు ఆదాయాన్నిచ్చే ‘సెకండ్ శాలరీ’..!
- ఆకాశంలో కనువిందు చేయనున్న 5 గ్రహాలు..!