రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగారం పట్టివేత

- June 20, 2015 , by Maagulf
రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగారం పట్టివేత

రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణీకుడు అక్రమంగా తీసుకొచ్చిన కిలో బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఉదయం దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ ప్రయాణీకుడి లగేజీని అధికారులు తనిఖీ చేశారు. ఈ తనిఖీలో ఎలక్ట్రికల్ స్టౌ కింది భాగంలో కిలో బరువు కలిగిన బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. నిందితుడు ముంబైకి చెందిన రఫీక్‌గా గుర్తించారు. 

 

--సి.శ్రీ(దుబాయ్) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com