ఖతార్ లో వారాంతాలలో కూడా వైద్య సేవలు

- June 20, 2015 , by Maagulf
ఖతార్ లో వారాంతాలలో కూడా వైద్య సేవలు

మెస్సైమీర్ హెల్త్ సెంటెర్‌లో వారాంతాలలో కూడా  దంతవైద్య సేవలు తప్ప మిగతా అన్ని  సేవలు అందించబడతాయని కతార్ ప్రైమరీ హెల్త్ కేర్ కార్పొరేషన్ (PHCC) వారు ప్రకటించారు.ఇంకా, శ్రామిక మరియు సామాజిక వ్యవహారాల మంత్రిత్వశాఖ (MoLSA), వ్యక్తిగత ఆరోగ్యం మరియు భద్రతను గురించి ఒక ప్రత్యేక శాఖను నెలకొల్పనున్నట్టు తెలియవచ్చింది. ఈ కొత్త శాఖ, వృత్తికి సంబంధించిన పని ప్రదేశాలలో, కంపెనీలలో దుర్ఘటనలు, ప్రమాదాలు, గాయపడిన సంఘటనలకు సంబంధించి విధులు నిర్వహిస్తుంది. ఇంకా, అక్కడ ఆరోగ్యం మరియు భద్రతను గురించిన మార్గదర్శకాలు ఇవ్వడం, పర్యవేక్షణ, వృత్తిసంబంధిత ప్రమాదాలను నివారించడానికి అవసరమైన ముందుజాగ్రత్త ఆదేశాలను జారీచేస్తుంది. ఈ శాఖ ఇన్‌స్పెక్టర్లు, ప్రమాదాలు, భద్రతప్రమాణాల అతిక్రమణ వంటివాటి  వివరాలను సంబంధిత న్యాయసంస్థలకు నివేదిస్తారు.

 

                                       --- వి. రాజ్ కుమార్, మాగల్ఫ్ ప్రతినిధి, ఖతార్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com