రోడ్డు దాటుతుండగా ఢీకొట్టిన కార్లు.. ఆసియా వ్యక్తి మృతి

- March 21, 2023 , by Maagulf
రోడ్డు దాటుతుండగా ఢీకొట్టిన కార్లు.. ఆసియా వ్యక్తి మృతి

యూఏఈ: 34 ఏళ్ల ఆసియా వ్యక్తి పాదచారుల క్రాసింగ్ కోసం అనుమతి లేని స్థలం నుండి రోడ్డు దాటుతుండగా రెండు వేర్వేరు వాహనాలు ఢీకొని మరణించాడు. కోర్టు ఫైల్స్ ప్రకారం.. బాధితుడు తన సైకిల్‌తో రోడ్డు దాటుతుండగా అరబ్ వ్యక్తి నడుపుతున్న కారు అతన్ని ఢీకొట్టింది. అదే సమయంలో మరో గల్ఫ్ పౌరుడు నడుపుతున్న కారు కూడా అతన్ని ఢీకొట్టింది. రెండుకార్లు రెండుసార్లు ఢీకొనడం అతడు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచాడు. రస్ అల్ ఖైమాలోని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కార్యాలయం.. సదరు కార్ల డ్రైవర్లు ట్రాఫిక్ సంకేతాలను గమనించకపోవడం, వారి వాహనాలను శ్రద్ధ లేకుండా నడపడం వల్ల ప్రమాదానికి కారణమై బాధితుడి మరణానికి కారణమయ్యారని వాదించింది. రస్ అల్ ఖైమాలోని ట్రాఫిక్ మిస్‌డిమినర్ కోర్టు ఇద్దరికి 1,500 దిర్హామ్‌ల చొప్పున జరిమానా విధించింది. బాధితుడి వారసులకు 66,666 దిర్హాలు చట్టబద్ధమైన బ్లడ్ మనీగా చెల్లించాలని ఇద్దరినీ ఆదేశించింది. ఘటన జరిగినప్పుడు బాధితుడు రోడ్డును కుడి నుంచి ఎడమకు దాటుతున్నట్లు దర్యాప్తులో తేలింది. అతను కుడి లేన్ దాటి.. మధ్య , ఎడమ లేన్ల మధ్య ప్రవేశించాడని, అదే సమయంలో రెండు వాహనాలు అతన్ని ఢీకొన్నాయని కోర్టు తన తీర్పులో పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com