సౌదీ రీజియన్ల చుట్టూ రేస్ సర్క్యూట్‌ల నిర్మాణం!
- March 21, 2023
జెడ్డా : సౌదీ అరేబియా రీజియన్ల చుట్టూ చిన్న రేస్ సర్క్యూట్‌ల కోసం మౌలిక సదుపాయాలను నిర్మించడంలో కృషి చేస్తున్నట్లు సౌదీ ఆటోమొబైల్, మోటార్ సైకిల్ ఫెడరేషన్ (SAMF) ప్రెసిడెంట్ ప్రిన్స్ ఖలీద్ బిన్ సుల్తాన్ అల్-అబ్దుల్లా అల్-ఫైసల్ చెప్పారు.ఈ సర్క్యూట్‌లలో రేసింగ్ అకాడమీలు కూడా ఉంటాయని ప్రిన్స్ ఖలీద్ పేర్కొన్నారు. రాబోయే సంవత్సరాల్లో సర్క్యూట్‌లు, స్థానిక ఈవెంట్‌లు, అకాడమీల పరంగా రాజ్యం అనేక మార్పులకు సాక్ష్యంగా నిలుస్తుందన్నారు. ఔత్సాహికులు, నిపుణులు సౌదీ అరేబియాలో నిరంతరం రేస్‌లో పాల్గొనేందుకు వీలుగా స్థానిక టోర్నమెంట్‌లు చాలా జరుగుతాయని, కిడ్డియా ప్రాజెక్ట్‌లో మోటార్‌సైకిళ్లు, కార్ల కోసం శాశ్వత సర్క్యూట్‌లను నిర్మించే ప్రణాళికలు సైతం ఉన్నాయని ఆయన తెలిపారు. అరామ్‌కో, ఆస్టన్ మార్టిన్‌ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి సంబంధించి.. ఇది సానుకూల భాగస్వామ్యమని ప్రిన్స్ ఖలీద్ అన్నారు. సౌదీ అరేబియా ఫార్ములా 1 కార్ల తయారీపై స్పందిస్తూ.. అంతర్జాతీయ కంపెనీలు, జట్లకు సౌదీ అరేబియాలో ఇక్కడ చోటు కల్పించాలనే ప్రణాళిక ఉందని తెలిపారు. ఫార్ములా ఇ, ఫార్ములా 1, ర్యాలీ వంటి మోటార్‌లకు సంబంధించిన కార్యక్రమాలకు అభిమానుల హాజరు ప్రతి సంవత్సరం పెరుగుతుందని ఫ్రిన్స్ ఖలీద్ గుర్తుచేశారు.
తాజా వార్తలు
- భారత్‌లో 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు
- ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!
- సౌదీలో తగ్గిన బ్యాంకింగ్, పేమెంట్ సేవా రుసుములు..!!
- యూఎస్ కాన్సులేట్ 3 రోజులపాటు మూసివేత..!!
- లైసెన్స్ లేకుండా అడ్వర్టైజ్.. KD 500 జరిమానా..!!
- బహ్రెయిన్‌లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- ఒమాన్-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- మిషన్ భద్రత పై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు
- దుబాయ్‌లో ఘనంగా ప్రవాస తెలుగువారి క్రూజ్ క్రిస్మస్ వేడుకలు
- 'National Army Day' కి ఐక్యతతో నివాళులు







