రమదాన్: ఈ దేశాలలో 17 గంటలకు పైగా ఉపవాసాలు

- March 21, 2023 , by Maagulf
రమదాన్: ఈ దేశాలలో 17 గంటలకు పైగా ఉపవాసాలు

యూఏఈ: రమదాన్ సందర్భంగా ప్రపంపవ్యాప్తంగా ముస్లింలు పగటిపూట ఉపవాసం ఉంటారు. రమదాన్ మాసంలో ఉపవాసం ఇస్లాం ఐదు మూలస్తంభాలలో ఒకటిగా పరిగణిస్తారు. ఆరోగ్యకరమైన ముస్లింలు యుక్తవయస్సు వచ్చినప్పటి నుండి రమదాన్ మాసంలో ఉపవాస నియమం పాటించాలి. అనారోగ్యంతో ఉన్నవారు, ప్రయాణాలు చేసేవారు, పీరియడ్స్ సమయంలో మహిళలకు ఉపవాసం నుండి మినహాయింపు ఉంటుంది.

సాధారణంగా రమదాన్ ఉపవాస సమయాలు తెల్లవారుజాము నుండి సూర్యాస్తమయం వరకు ఉంటాయి. ప్రపంచంలో ఎక్కడ ఉన్నారనే దానిపై ఆధారపడి సూర్యోదయం- సూర్యాస్తమయ సమయాల ప్రకారం ఉపవాస సమయాల సంఖ్య మారుతూ ఉంటాయి. మధ్యప్రాచ్యంలో, భూమధ్యరేఖకు సమీపంలో ఉన్న ప్రాంతం కారణంగా ఉపవాస సమయం సగటుకు దగ్గరగా ఉంటుంది. భూమధ్యరేఖ నుండి ఉత్తరాన ఉన్న ప్రదేశంలో ఎక్కువ వ్యత్యాసం ఉంటుంది. ఇది ఎక్కువ ఉపవాస సమయాలకు దారి తీస్తుంది. అదే సమయంలో దక్షిణ ధ్రువానికి దగ్గరగా వెళితే ఉపవాస వ్యవధి తక్కువగా ఉంటుంది.

నార్వే వంటి ప్రపంచంలోని కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడ నెలల తరబడి సూర్యుడు అస్తమించడు. ఈ దేశాలు మక్కా, సౌదీ అరేబియా లేదా సమీప ముస్లిం దేశంలో సమయాలను అనుసరించడానికి మతపరమైన తీర్పులను కలిగి ఉన్నాయి.

ఈ సంవత్సరం ఎక్కువ కాలం ఉపవాసం ఉండే నగరాలు:
నూక్, గ్రీన్లాండ్ - 18 గంటలు

రేక్జావిక్, ఐస్లాండ్ - 18 గంటలు

హెల్సింకి, ఫిన్లాండ్ - 17 గంటలు

స్టాక్‌హోమ్, స్వీడన్ - 17 గంటలు

గ్లాస్గో, స్కాట్లాండ్ - 17 గంటలు

లండన్, యూకే - 16 గంటలు

ఇస్లామాబాద్, పాకిస్తాన్ - 14 గంటలు

కాబూల్, ఆఫ్ఘనిస్తాన్ - 14 గంటలు

టెహ్రాన్, ఇరాన్ - 14 గంటలు

బాగ్దాద్, ఇరాక్ - 14 గంటలు

బీరుట్, లెబనాన్ - 14 గంటలు

డమాస్కస్, సిరియా - 14 గంటలు

కైరో, ఈజిప్ట్ - 14 గంటలు

జెరూసలేం - 14 గంటలు

కువైట్ సిటీ, కువైట్ - 14 గంటలు

న్యూఢిల్లీ, భారతదేశం - 14 గంటలు

హాంకాంగ్ - 14 గంటలు

ఢాకా, బంగ్లాదేశ్ - 14 గంటలు

మస్కట్, ఒమన్ - 14 గంటలు

రియాద్, సౌదీ అరేబియా - 14 గంటలు

దోహా, ఖతార్ - 14 గంటలు

అబుదాబి, యూఏఈ - 14 గంటలు

అడెన్, యెమెన్ - 14 గంటలు

అడిస్ అబాబా, ఇథియోపియా - 13 గంటలు

డాకర్, సెనెగల్ - 13 గంటలు

అబుజా, నైజీరియా - 13 గంటలు

కొలంబో, శ్రీలంక - 13 గంటలు

బ్యాంకాక్, థాయిలాండ్ - 13 గంటలు

ఖార్టూమ్, సూడాన్ - 13 గంటలు

కౌలాలంపూర్, మలేషియా - 13 గంటలు

అతి తక్కువ ఉపవాస సమయాలు ఉన్న నగరాలు:
సింగపూర్: 13 గంటలు

నైరోబి, కెన్యా: 13 గంటలు

లువాండా, అంగోలా: 13 గంటలు

జకార్తా, ఇండోనేషియా: 13 గంటలు

బ్రసిలియా, బ్రెజిల్: 13 గంటలు

హరారే, జింబాబ్వే: 13 గంటలు

జోహన్నెస్‌బర్గ్, దక్షిణాఫ్రికా: 13 గంటలు

బ్యూనస్ ఎయిర్స్, అర్జెంటీనా: 12 గంటలు

సియుడాడ్ డెల్ ఎస్టే, పరాగ్వే: 12 గంటలు

కేప్ టౌన్, దక్షిణాఫ్రికా: 12 గంటలు

మాంటెవీడియో, ఉరుగ్వే: 12 గంటలు

కాన్బెర్రా, ఆస్ట్రేలియా: 12 గంటలు

ప్యూర్టో మోంట్, చిలీ: 12 గంటలు

క్రైస్ట్‌చర్చ్, న్యూజిలాండ్: 12 గంటలు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com