మూడోసారి ముగిసిన కవిత ఈడీ విచారణ..

- March 21, 2023 , by Maagulf
మూడోసారి ముగిసిన కవిత ఈడీ విచారణ..

న్యూ ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో మూడోసారి.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత మూడోసారి ఈడీ విచారణ ముగిసింది. మంగళవారం సుదీర్ఘంగా కవితను విచారించారు ఈడీ అధికారులు. 8 గంటలకు పైగా ఆమెను ఎంక్వైరీ చేశారు. లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసుకి సంబంధించి కవితను ప్రశ్నించారు ఈడీ అధికారులు. అటు కవిత ఇచ్చిన 10 ఫోన్లలోని డేటాను విశ్లేషిస్తున్నారు ఈడీ అధికారులు.

ఈడీ కవితను విచారించడం ఇది మూడోసారి. దీంతో సర్వత్రా ఉత్కంఠ కనిపించింది.కవితను ఈడీ అదుపులోకి తీసుకుంటుందా? అనేది ఉత్కంఠ నెలకొంది. అయితే, అదేమీ జరగలేదు. కాగా, కవిత ఈడీ విచారణ కొనసాగనుంది.రానున్న రోజుల్లో కవితకు మరిన్ని సమన్లు జారీ చేయబోతున్నారు అని సమాచారం. ఇప్పటికే కవితకు సంబంధించిన వ్యాపార, ఆర్థిక లావాదేవీలపై ఫోకస్ పెట్టిన ఈడీ.. దానికి సంబంధించిన స్టేట్ మెంట్లను ఈడీ తీసుకుంది. మొత్తం 11 ఫోన్లను ఈడీ అధికారులు పరిశీలిస్తున్నారు.

ముందస్తుగానే లిక్కర్ పాలసీ డ్రాఫ్ట్ కాపీ కవిత ఫోన్ లోకి వచ్చిందా? లిక్కర్ స్కామ్ లో కవిత పాత్ర ఏంటి? సౌత్ గ్రూప్ తో ఉన్న సంబంధాలు, ఇండో స్పిరిట్స్ లో పెట్టుబడులు సహా ఢిల్లీలో లిక్కర్ కంపెనీలకు అనుకూలంగా పాలసీని మార్చడానికి జరిగిన సమావేశంలో కవిత పాల్గొనడం, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, కవితకు మధ్య ఉన్న సంబంధాలు.. కవిత వారిని కలిశారా? వారితో మాట్లాడారా? లిక్కర్ పాలసీకి సంబంధించిన బిజినెస్ ను కేవలం ఢిల్లీకి మాత్రమే పరిమితం చేయకుండా, ఇతర రాష్ట్రాలకు ఎక్స్ ప్యాండ్ చేయడం.. ఇలా అనేక అంశాలకు సంబంధించి నిందితులు నుంచి స్టేట్ మెంట్స్ ఆధారంగా కవితను ఈడీ అధికారులు ప్రశ్నించడం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com